చిరుతో నటించే అవకాశం వచ్చింది కానీ ఆసక్తి లేకపోవడంతో వదులుకున్నాను.. విజయ శాంతి ఆసక్తికర వ్యాఖ్యలు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో విజయశాంతి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత చాలా మంది ఆఫర్లతో తనను సంప్రదించారని, కానీ వారికి నో చెప్పానని, చివరికి చిరంజీవి సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని కూడా తన వద్దకు వచ్చారని కానీ తనకు ఆసక్తి లేకపోవడంతో వారిని వెనక్కు పంపానని చెప్పుకొచ్చింది.

vijayashanti talk about act with chiru: టాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా పేరు సంపాదించుకున్న తొలి హీరోయిన్ విజయశాంతి. దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడిన విజయశాంతి అప్పట్లో దర్శకులకు, హీరోలకు ఫేవరేట్ ఆప్షన్. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే విజయశాంతి రాజకీయాల్లో బిజీగా మారి సినిమాలను దూరంగా ఉంటూ వచ్చింది. ఇక తాజాగా సరిలేరు నీకెక్వరూ చిత్రంతో మరోసారి వెండితెర ప్రేక్షకులను పలకరించిందీ రాములమ్మ. ఇక విజయ శాంతి మళ్లీ సినిమాలతో ఫుల్ బిజీగా మారుతుందని అందరూ భావించారు. అయితే అందరి ఆలోచనలను తలకిందులు చేస్తూ విజయశాంతి సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల ఈ లేడి సూపర్ స్టార్ మళ్లీ రాజకీయాల్లో బిజీగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో విజయశాంతి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత చాలా మంది ఆఫర్లతో తనను సంప్రదించారని, కానీ వారికి నో చెప్పానని, చివరికి చిరంజీవి సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని కూడా తన వద్దకు వచ్చారని కానీ తనకు ఆసక్తి లేకపోవడంతో వారిని వెనక్కు పంపానని చెప్పుకొచ్చింది. రాజకీయాల్లో మళ్లీ బిజీగా మారడానికి సిద్ధమవుతోన్న విజయశాంతి ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.




