లేడీ సూపర్ స్టార్ విజయశాంతి @40 ఇయర్స్ ఇండస్ట్రీ
లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ రాములమ్మ ఈ పేర్లు వినగానే టక్కున గుర్తొస్తుంది నిన్నటితరం హీరోయిన్ విజయశాంతి.
“నా తొలి తెలుగు సినిమా కిలాడి కృష్ణుడు రిలీజై 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నాలుగు దశాబ్దాల ప్రయాణంలో మంచి మనసుతో ఆదరించి, అనేకమైన అద్భుత విజయాలను, సమున్నతమైన స్థానాన్ని అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు అందించారు. నాకు తోడుగా నిలిచిన వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్న సందర్భం ఇది. నన్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన సూపర్‌స్టార్ కృష్ణ గారికి, విజయనిర్మల గారికి మరోసారి కృతజ్ఞతలు.” అని విజయశాంతి పేర్కొన్నారు.
కాగా విజయశాంతికి కర్తవ్యం, ప్రతిఘటన, రేపటి పౌరలు, నేటిభారతం, ముద్దులమావయ్య, గ్యాంగ్‌లీడర్, జానకిరాముడు, చిన్నరాయుడు వంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇటీవల మహేష్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు విజయశాంతి.
Also Read :
దొంగతనానికిి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు