ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయ కాంత్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా వదంతులు వస్తున్నాయి. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో విజయ కాంత్ అభిమానులు, డీఎండీకే నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రి వద్ద పోలీసులను మోహరించడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. మరోవైపు డీఎండీకే ఆరోగ్యంపై వదంతులు నమ్మవద్దని ఆయన సతీమణి ప్రేమలతా విజయకాంత్ ఎప్పటికప్పుడు అభిమానులకు ధైర్యం, భరోసా అందిస్తున్నారు. తాజాగా విజయ కాంత్ ఆరోగ్యంపై ప్రేమలతా కీలక సమాచారం అందించారు. తన భర్త కోలుకుంటాన్నరని, త్వరలో క్షేమంగా వస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే.. ఆస్పత్రిలో విజయకాంత్‌తో ఉన్న ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. వీటిని చూసిన విజయ్ కాంత్ అభిమానులు, డీఎండీకే కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
ఆస్పత్రిలో విజయ్ కాంత్‌తో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రేమలతా విజయ కాంత్ .. ‘కెప్టెన్ ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన అతి త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తాడు. మనందరినీ చూస్తాడు. ఆయన ఆరోగ్యంపై వదంతులను ఎవరూ నమ్మవద్దు. సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. సుమారు రెండు వారాల క్రితం (నవంబర్ 18) దగ్గు, గొంతునొప్పి తదితర అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు విజయ కాంత్. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటూనే మరో 14 రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స అందించాలని డాక్టర్లు చెప్పడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు విజయ కాంత్ కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని, కృత్రిమ శ్వాసతో ట్రీట్‌మెంట్ తీసుకున్నారంటూ పలు యూట్యూబ్ ఛానెన్స్ కథనాలు ప్రసారం చేశాయి. తాజాగా వీటిపైన స్పందించిన ప్రేమలతా తన భర్త ఆరోగ్యంపై తప్పుడు ప్రచారాలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
கேப்டன் ஆரோக்கியமாக இருக்கிறார்.
வெகு விரைவில் கேப்டன் நல்ல உடல் நலத்துடன் வீடு திரும்புவார், நம் அனைவரையும் சந்திப்பார்.
யாரும் வதந்திகளை பரப்பவும் வேண்டாம், நம்பவும் வேண்டாம்! என்று அன்போடு கேட்டுக்கொள்கிறேன்.– திருமதி. பிரேமலதா விஜயகாந்த். pic.twitter.com/u6tvBGtCdD
— Vijayakant (@iVijayakant) December 2, 2023
கேப்டன் ஆரோக்கியமாக இருக்கிறார்.
வெகு விரைவில் கேப்டன் நல்ல உடல் நலத்துடன் வீடு திரும்புவார், நம் அனைவரையும் சந்திப்பார்.
யாரும் வதந்திகளை பரப்பவும் வேண்டாம், நம்பவும் வேண்டாம்! என்று அன்போடு கேட்டுக்கொள்கிறேன்.– திருமதி. பிரேமலதா விஜயகாந்த். pic.twitter.com/sbzd0FDOX4
— Vijayakant (@iVijayakant) December 2, 2023