ఆ స్టార్ హీరో సినిమాలో లేడట..!
తమిళ స్టార్ హీరో ధనుష్ వెట్రిమారన్ డైరెక్షన్‌లో ‘అసురన్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని గతంలో వార్తలు రాగ తాజాగా చిత్ర యూనిట్ ఆ వార్తలను కొట్టిపారేసింది. మరోవైపు ఈ చిత్రంలో ధనుష్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అందులో ఒకటి 45 సంవత్సరాలు కలిగిన తండ్రి పాత్ర కాగా మరొకటి కొడుకు పాత్ర. […]

తమిళ స్టార్ హీరో ధనుష్ వెట్రిమారన్ డైరెక్షన్‌లో ‘అసురన్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని గతంలో వార్తలు రాగ తాజాగా చిత్ర యూనిట్ ఆ వార్తలను కొట్టిపారేసింది.
మరోవైపు ఈ చిత్రంలో ధనుష్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అందులో ఒకటి 45 సంవత్సరాలు కలిగిన తండ్రి పాత్ర కాగా మరొకటి కొడుకు పాత్ర. మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను వి.క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు.




