Vijay Deverakonda: సినిమాల్లోకి రాకముందు విజయ్ నటించిన సీరియల్ ఏదో తెలుసా? .. వైరలవుతున్న ఓల్డ్ వీడియో..

బాలీవుడ్ భామ అనన్య పాండే, రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ 25న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో విజయ్ చిన్ననాటి జ్ఞాపకం ఒకటి వైరల్ అవుతుంది.

Vijay Deverakonda: సినిమాల్లోకి రాకముందు విజయ్ నటించిన సీరియల్ ఏదో తెలుసా? .. వైరలవుతున్న ఓల్డ్ వీడియో..
Vijay Deverakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 24, 2022 | 5:25 PM

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‏లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఆ తర్వాత గీతగోవిందం, డియర్ కామ్రెడ్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఈ సినిమాల తర్వాత అభిమానులకు రౌడీగా మారిపోయాడు విజయ్. ప్రస్తుతం ఈ హీరో లైగర్ (Liger) ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‏తో పూరి మరోసారి తన మార్క్ చూపించడంతో లైగర్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ భామ అనన్య పాండే, రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ 25న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో విజయ్ చిన్ననాటి జ్ఞాపకం ఒకటి వైరల్ అవుతుంది.

విజయ్ సినిమాల్లోకి అరంగేట్రం చేయకముందే చైల్డ్ ఆర్టిస్ట్‏గా స్క్రీన్ పై మెరిశాడు. బాలనటుడిగా కెరీర్ ఆరంభించి మెప్పించాడు విజయ్. సత్యసాయి బాబా గురించి తెలుగు సీరియల్‏లో నటించాడు విజయ్. ఇందుకు సంబంధించిన ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన పాఠశాల విద్యను ఆంధ్రప్రదేశ్‏లోని పుట్టపర్తిలోని సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్‏లో చదివాడు. అక్కడ చదువుతున్న సమయంలోనే సత్యసాయి బాబా జీవిత చరిత్రను తెలిపుతూ రూపొందించిన సీరియల్లో విజయ్ నటించాడు. ఈ వీడియోను రౌడీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం విజయ్.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!