Vijay Deverakonda: సొంత మనుషులే ఇలా చేస్తున్నారు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన విజయ్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారారు. అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్.. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Vijay Deverakonda: సొంత మనుషులే ఇలా చేస్తున్నారు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్..
Vijay Deverakonda

Updated on: Jan 11, 2026 | 8:36 PM

సినీపరిశ్రమను ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఫేక్ రివ్యూస్. కథ, డైరెక్షన్, యాక్టింగ్ ఇలా ప్రతి అంశం సరిగ్గా ఉన్నప్పటికీ కొందరు ఫేక్ రివ్యూస్ ఇవ్వడంతో సినిమా విజయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సోషల్ మీడియాలో ఫేక్ రివ్యూస్ షేర్ చేస్తూ.. సినిమా విడుదలైన క్షణాల్లోనే రిజల్ట్ క్లియర్ చేస్తున్నారు. అలాగే బుక్ మై షో వంటి వెబ్ సైట్స్ లోనూ సినిమాలకు నెగిటివ్ రేటింగ్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై మన శంకరవరప్రసాద్ గారు సినిమా నిర్మాతలు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆదేశాల ప్రకారం బుక్ పై షోలో నెగిటివ్ రేటింగ్స్, రివ్యూస్ ఆప్షన్ తాత్కలికంగా నిలిపివేశారు. దీనిపై స్టా్ర్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ విషయం తనకు సంతోషాన్ని కలిగించినప్పటికీ.. కొంత బాధను కూడా ఇస్తుందని తెలిపారు. ఇదే విషయాన్ని సుధీర్ఘంగా రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

“బుక్ మై షోలో ఇలా చూడడం ఒక రకంగా సంతోషంగా.. మరో రకంగా బాధగానూ ఉంది. ఈ చర్యతో చాలా మంది కష్టం, కలలు, డబ్బును కాపాడుకునేందుకు దారి కనబడింది. ఇక బాధపడాల్సిన విషయం ఏంటంటే.. మన సొంతవాళ్లే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. బతకండి.. బతకనీయండి, అనే నినాదం ఏమైందీ.. ? అందరూ కలిసి ఎదగాలనే భావన ఎక్కడికి వెళ్లింది ? డియర్ కామ్రేడ్ మూవీ సమయంలో వ్యవస్థీకృతమైన రాజకీయాలతో ఇలాంటి దాడులు చూసి షాకయ్యాను. నేను మాట్లాడిన ప్రతిసారి చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు అయ్యింది. ఒక మంచి సినిమాను ఎవరూ ఆపలేరని నాతో అన్నారు. నాతో పనిచేసిన దర్శకులు, నిర్మాతలకు ఈ సమస్య గురించి అర్థమయ్యింది.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

ఎందుకు ఇలా చేస్తున్నారని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. నా కలలను కాపాడుకునేందుకు వీళ్లతో ఎలా పోరాటం చేయాలా ? అనుకున్నా. ఇన్నాళ్లకు ఈ విషయం బయటకు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. చిరంజీవి లాంటి అగ్ర హీరో సినిమాకు కూడా ఇలాంటి ముప్పు ఉందని కోర్టు గుర్తించినందుకు సంతోషంగా ఉంది. దీనితోనే ఈ సమస్య పూర్తి కాదు.. కానీ కొంతవరకు మేలు జరుగుతుంది. మన శంకరవరప్రసాద్ సినిమాతోపాటు సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..