AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ నయా మూవీ పోస్టర్.. రౌడీ హీరో ఇరగదీశాడుగా..

లైగర్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ సినిమా రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. ఆతర్వాత వచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత రీసెంట్ గా పరశురామ్ దర్శకత్వం వహించిం ఆ ఫ్యామిలీ మ్యాన్ అనే సినిమాతో ఆడియన్స్ ను పలకరించాడు.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ నయా మూవీ పోస్టర్.. రౌడీ హీరో ఇరగదీశాడుగా..
Vijay Deverakonda
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 02, 2024 | 2:48 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అర్జున్ రెడీ, గీతగోవిందం లాంటి హిట్స్ తర్వాత విజయ్ నుంచి అదే రేంజ్ హిట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. లైగర్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ సినిమా రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. ఆతర్వాత వచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత రీసెంట్ గా పరశురామ్ దర్శకత్వం వహించిం ఆ ఫ్యామిలీ మ్యాన్ అనే సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ సినిమా కూడా విజయ్ అభిమానులకు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో విజయ్ ఇప్పుడు నెక్స్ట్ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

విజయ్ ప్రస్తుతం మూడు సినిమాలను అనౌన్స్ చేశాడు. వాటిలో గౌతమ్ తిన్ననూరి  దర్శకత్వంలో చేస్తోన్న సినిమా ఒకటి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో 12 వ సినిమా ఇది. ఈ సినిమా నుంచి తాజాగా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. షార్ట్ హెయిర్ లో కనిపిస్తున్నాడు విజయ్. జర్సీ సినిమాతో హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి  ఇప్పుడు మరో ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని ఈ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది.

ఇక ఈ పోస్టర్ చూస్తే.. ఒంటి నిండా దెబ్బలు, అలాగే  ముఖంపై ర‌క్తంతో వ‌ర్షంలో త‌డుస్తూ కనిపించాడు విజయ్.. ర‌క్తం కారుతుండగా చాలా కోపంగా పైకి చూస్తూ బిగ్గరగా అరుస్తూ కనిపించాడు విజయ్. త్వరలోనే ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ ఆగస్టులో ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపింది.ఈ సినిమాలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పోస్టర్ చూస్తుంటే.. ఈ మూవీతో విజయ్ మంచి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జూన్ 21న ఏపీలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం-సీఎం చంద్రబాబు
జూన్ 21న ఏపీలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం-సీఎం చంద్రబాబు
మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా ??
మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా ??
కలెక్టర్ కావాలని ఆశపడ్డ పేద విద్యార్థికి.. అండగా నిలిచిన కమల్..
కలెక్టర్ కావాలని ఆశపడ్డ పేద విద్యార్థికి.. అండగా నిలిచిన కమల్..
అప్పుడు అదృష్టం కలిసిరాలేదు.. ఇప్పుడు విశాల్‌ను పెళ్లి చేసుకుంటూ
అప్పుడు అదృష్టం కలిసిరాలేదు.. ఇప్పుడు విశాల్‌ను పెళ్లి చేసుకుంటూ
సినిమా మాదిరి ప్రేమ కథ! ట్విస్ట్ అండ్ టర్న్స్‌ అబ్బో
సినిమా మాదిరి ప్రేమ కథ! ట్విస్ట్ అండ్ టర్న్స్‌ అబ్బో
OTT సంస్థతో ఒప్పదం.. కట్ చేస్తే నోరెళ్లబెడుతున్న హీరో ఫ్యాన్స్‌
OTT సంస్థతో ఒప్పదం.. కట్ చేస్తే నోరెళ్లబెడుతున్న హీరో ఫ్యాన్స్‌
హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం.. ముక్కు, చేతులకు తీవ్ర గాయాలు..
హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం.. ముక్కు, చేతులకు తీవ్ర గాయాలు..
హీరోగా నా ఎదుగుదలను చూడకుండానే.. వెళ్లిపోయావా అమ్మా..
హీరోగా నా ఎదుగుదలను చూడకుండానే.. వెళ్లిపోయావా అమ్మా..
తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు
తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు
ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? ఇది మీ కోసమే
ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? ఇది మీ కోసమే