Vijay Deverakonda: ప్రతి ఏడాది సాయం చేస్తా.. సినిమాలు చేస్తోన్నంత కాలం అండగా ఉంటా.. విజయ్ దేవరకొండ..
ముందుగా చెప్పినట్లుగా మాట నిలబెట్టుకున్నారు విజయ్. ఇచ్చిన మాట ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 100 కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చెక్ స్వయంగా అందించారు విజయ్. హైదరాబాద్ లో స్పెడింగ్ ఖుషి అనే ఈవెంట్ నిర్వహించి చెక్స్ అందించారు. ఇలా 100 కుటుంబాలకు సాయం చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని.. ఇలాగే ప్రతి ఏడాది సాయం చేస్తానని.

ఖుషి సినిమాతో చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నారు విజయ్ దేవరకొండ. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో విజయ్ జోడిగా సమంత కథానాయికగా నటించింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో అభిమానులకు థాంక్స్ చెప్పడమే కాకుండా.. తన రెమ్యునరేషన్ లో దాదాపు కోటి రూపాయలను సాయం చేస్తానని ప్రకటించారు విజయ్. ఇటీవల ఖుషి ప్రచారంలో భాగంగా విశాఖపట్నం వెళ్లిన విజయ్.. అక్కడ మాట్లాడుతూ.. దాదాపు 100 కుటుంబాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజల నుంచి అప్లికేషన్స్ తీసుకోనున్నట్లు తెలిపారు.
ఇక ముందుగా చెప్పినట్లుగా మాట నిలబెట్టుకున్నారు విజయ్. ఇచ్చిన మాట ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 100 కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చెక్ స్వయంగా అందించారు విజయ్. హైదరాబాద్ లో స్పెడింగ్ ఖుషి అనే ఈవెంట్ నిర్వహించి చెక్స్ అందించారు. ఇలా 100 కుటుంబాలకు సాయం చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని.. ఇలాగే ప్రతి ఏడాది సాయం చేస్తానని.. సినిమాలు చేస్తున్నంతకాలం ప్రజలకు ఏదో ఒక రూపంలో సాయమందిస్తానని అన్నారు.
View this post on Instagram
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. “నాపై ఇంత ప్రేమను చూపిస్తోన్న మీకోసం చాలా మంచి కార్యక్రమాలు చేయాలని ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేను సాయం కోసం ఎదురుచూసినవాడినే. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నా తమ్ముడు ఇంజనీరింగ్ జాయిన్ కావాలి. తమ్ముడికి ఫీజు కట్టడానికి ఇంట్లో అమ్మానాన్న పడిన ఒత్తిడి చూశాను. ఎవరైనా ఒక లక్ష రూపాయలు ఇస్తే మాకు సాయమయ్యేది అనుకున్నాను. అవన్నీ దాటుకుని ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను. మీకు ఒక ఫ్యామిలీలా ఉన్నారు. అది నా వ్యక్తిగత కోరిక. ఈ చిన్న సాయం మీకు ఉపయోగపడితే అదే నాకు సంతోషం. ఈ ప్రకటన చేసినప్పటి నుంచి దాదాపు 50 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. కానీ 100 మందికి మాత్రమే ఇవ్వగల్గుతున్నాను. ప్రతి సంవత్సరం సాయం చేస్తుంటాను. సినిమాలు చేస్తున్నంత కాలం మీ అందరికి అండగా ఉంటాను” అని అన్నారు విజయ్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




