Samantha: బాలీవుడ్ పై గురిపెట్టిన సౌత్ హీరోయిన్స్.. సల్మాన్ ఖాన్‌తో జోడి కట్టనున్న సమంత ?..
బీటౌన్ హీరోహీరోయిన్స్ సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండగా.. ఇప్పుడు మన ముద్దుగుమ్మలు బీటౌన్ పై గురిపెట్టారు. ఇప్పటికే జవాన్ చిత్రంతో నయనతార బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంలో షారుఖ్, నయనతారల కెమిస్ట్రీకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో లేడీ సూపర్ స్టార్ కు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరో బ్యూటీ బీటౌన్ ఎంట్రీకి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తనే సమంత.

గత కొన్నాళ్లుగా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సౌత్ మూవీస్ భారీ విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. చిన్న, పెద్ద సినిమాలు ఇటు దక్షిణాదినే కాకుండా ఉత్తారాది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఓవైపు బీటౌన్ హీరోహీరోయిన్స్ సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండగా.. ఇప్పుడు మన ముద్దుగుమ్మలు బీటౌన్ పై గురిపెట్టారు. ఇప్పటికే జవాన్ చిత్రంతో నయనతార బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంలో షారుఖ్, నయనతారల కెమిస్ట్రీకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో లేడీ సూపర్ స్టార్ కు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరో బ్యూటీ బీటౌన్ ఎంట్రీకి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తనే సమంత.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటికే వరుణ్ ధావన్ జోడిగా సిటాడెల్ చిత్రంలో నటించింది. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో సరనస నటించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించబోయే తన రాబోయే చిత్రంలో సమంతను కథానాయికగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను కరణ్ జోహర్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.
View this post on Instagram
అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద నయన్, షారుఖ్ కొత్త జంటతో ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు. ఇప్పుడు సల్మాన్, సమంత జోడితో మరింత ఎంటర్టైన్ చేయనున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇక్కడ సమంతతోపాటు.. త్రిష, అనుష్క శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఒకరిని సల్మాన్ కొత్త ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేయాలని భావిస్తున్నారట. అయితే దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.
View this post on Instagram
ఇటీవలే ఖుషి సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది సామ్. ఈ మూవీలో సామ్ ఆరాధ్య పాత్రలో నటించగా.. హీరోగా విజయ్ దేవరకొండ కనిపించారు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇక ఇందులోని సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




