Vijay Deverakonda: దటీజ్ విజయ్ దేవరకొండ.. ఎంత గొప్ప మనసు.. కారణం తెలిస్తే మెచ్చుకోకుండ ఉండలేరు..
కోవిడ్ లాక్ డౌన్ నుంచి ఇప్పటివరకు ఆ ఫౌండేషన్ నుంచి ఎంతోమందికి సాయమందించారు. కరోనా కాలంలో నగదు, వైద్య సహాయం పొందలేకపోయిన చాలా మందికి అతను సహాయం చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ మంచి మనసు గురించి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓ ట్రాన్స్‌జెండర్ విజయ్ వారికి చేసిన సాయం గురించి చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ సమయంలో అడగ్గానే విజయ్ తమకు ఎంతో సాయం చేశారని తెలిపింది.

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వెంటనే గీతా గోవిందం సినిమాతో మరో హిట్ అందుకున్నారు. రౌడీగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. సాయం చేయడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటారు. ఇటీవలే ఖుషి సినిమా హిట్ సందర్భంగా తన రెమ్యూనరేషన్ నుంచి కోటి రూపాయాలను దాదాపు వంద కుటుంబాలకు సాయంగా అందించిన సంగతి తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండ ఫౌండేషన్ పేరుతో ఎన్నో కుటుంబాలకు సాయం అందిస్తున్నారు. కోవిడ్ లాక్ డౌన్ నుంచి ఇప్పటివరకు ఆ ఫౌండేషన్ నుంచి ఎంతోమందికి సాయమందించారు. కరోనా కాలంలో నగదు, వైద్య సహాయం పొందలేకపోయిన చాలా మందికి అతను సహాయం చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ మంచి మనసు గురించి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓ ట్రాన్స్‌జెండర్ విజయ్ వారికి చేసిన సాయం గురించి చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ సమయంలో అడగ్గానే విజయ్ తమకు ఎంతో సాయం చేశారని తెలిపింది.
“కర్ఫ్యూ సమయంలో బయటకు వెళ్లి ఆహారం, మందులు కొనుక్కోలేకపోయాం.. ట్రాన్స్‌జెండర్లమైన మాకు డబ్బులు కావాలి.. ఆ సమయంలో ఎవరైనా నాకు సహాయం చేస్తారా అని ఇంటర్నెట్‌లో వెతికాను. అప్పుడే విజయ్ దేవరకొండ ఫౌండేషన్ గురించి తెలుసుకున్నాను. సాయం కావాలనుకునేవారు అందులో పేర్కొన్న ఫారమ్‌ను నింపాలి. వెంటనే పూర్తి చేశాను. నిమిషాల్లోనే వారి వైపు నుంచి ఫోన్ చేసి ఏం కావాలి అని అడిగారు. అప్పుడు స్టోర్‌కి వెళ్లి అవసరమైన వస్తువులు కొని ఆ బిల్ ఆన్‌లైన్‌లో పంపించండి.. బిల్లు చెల్లి్స్తామని చెప్పారు. వెంటనే తెచ్చుకున్నాను. వాళ్లు బిల్లు కట్టారు. విజయ్ సర్ పెట్టిన భోజనం నెలరోజులపాటు తిన్నాం. నాకే కాదు నాలాంటి 20 మందికి విజయ్ సాయమందించారు. ఆయనను ప్రత్యక్షంగా కలిసే అవకాశం వస్తే.. కచ్చితంగా కృతజ్ఞతలు చెబుతాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
In an industry obsessed with transphobia, didn’t expect someone would be trans ally. Will watch your every film on the big screen. Kudos @TheDeverakonda 🙌🏳️⚧️ pic.twitter.com/UWJUTvrIqR
— PJ (@filmisconstant) November 2, 2023
అలాగే ఇటీవల ప్రమాదవశాత్తు కాలును కోల్పోయిన ఓ చిన్నారికి రూ. లక్ష సాయంగా అందించారు విజయ్. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళికి చెందిన ఓ పాప ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. తన అభిమాన సంఘాల ద్వారా విషయం తెలుసుకున్న విజయ్.. వెంటనే ఆ చిన్నారికి రూ. లక్ష చెక్ అందేలా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.