Tollywood: ఐరెన్ లెగ్ అన్నారు.. రాత్రికి రాత్రే 9 ప్రాజెక్ట్స్ నుంచి తీసేశారు.. ఇప్పుడు ఇలా..

ప్రస్తుతం సినీరంగంలో స్టార్ స్టేటస్ ఉన్న హీరోహీరోయిన్స్ ఒకప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నవారే. ముఖ్యంగా హీరోయిన్ల గురించి చెప్పక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో అనేక సమస్యలు, అవమానాలు భరించి.. ప్రతి అవకాశం కోసం ఎంతో ఓపికగా ఎదురుచూసినవారే. వచ్చిన ఛాన్స్ సరిగ్గా ఉపయోగించుకుని.. ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు.

Tollywood: ఐరెన్ లెగ్ అన్నారు.. రాత్రికి రాత్రే 9 ప్రాజెక్ట్స్ నుంచి తీసేశారు.. ఇప్పుడు ఇలా..
Vidya Balan

Updated on: Jul 10, 2025 | 3:19 PM

సాధారణంగా సినీరంగంలో నటీనటులుగా రాణించడం అంత సులభం కాదు. ముఖ్యంగా హీరోయిన్స్ అనేక అవమానాలు, సవాళ్లను ఎదుర్కొని.. ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం స్టార్ హోదాలో ఉన్న తారలు చాలా కాలంగా ఒక్క సరైన అవకాశం కోసం ఎదురుచూసినవాళ్లే. వచ్చిన ప్రతి ఆఫర్ ఉపయోగించుకుని సహజ నటనతో ప్రేక్షకులను హృదయాలను గెలుచుకున్నారు. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తమదైన ముద్రవేసినవారే. ప్రస్తుతం సినీరంగంలో అగ్రకథానాయికగా దూసుకుపోతున్న ఓ హీరోయిన్ కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. తనను ఐరెన్ లెగ్ అనే ముద్ర వేశారని.. దీంతో రాత్రికి రాత్రే తనను 9 ప్రాజెక్ట్స్ నుంచి తీసేశారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా టాప్ హీరోయిన్‏గా రాణిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ విద్యాబాలన్.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యా బాలన్ మాట్లాడుతూ.. “కెరీర్ మొదట్లో హీరో మోహన్ లాల్ జోడిగా చక్రం సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.. షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అందుకు నేను కారణం అంటూ ప్రచారం జరిగింది. దీంతో నాపై ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసి నాపై విమర్శలు చేశారు. ఆ ఒక్క సినిమా ఆగిపోయిందని తెలిసి రాత్రికి రాత్రే నన్ను 9 ప్రాజెక్ట్స్ నుంచి తొలగించారు. అసలు ఆ సినిమా ఆగిపోవడానికి నేను కారణం కాదు. ఆ సినిమా డైరెక్టర్, మోహన్ లాల్ మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో ఆ ప్రాజెక్ట్ ఆపేశారు. కానీ ఆ సినిమా నా కెరీర్ పై ఎంతో ప్రభావం చూపించింది” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

“సవాళ్లు ఎదురైన నేను ధైర్యం కోల్పోలేదు. విశ్వాసంతో ముందుకు నడిచాను. నాపై నాకు ఉన్న నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబడేలా చేసింది. విశ్వాసంతో ముందుకు సాగితే ఏదోక రోజు కచ్చితంగా మనది అవుతుంది” అని అన్నారు విద్యా బాలన్. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. 2005లో పరిణిత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విద్యాబాలన్.. ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరు. ఇటీవలే భూల్ భూలయ్య 3 సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..