ఎందుకో ఆ హీరోతో సెట్ అవ్వడం లేదు.. అతనంటే చాలా ఇష్టం.. కానీ ఛాన్స్ రావడంలేదన్న రావు రమేష్
టాలీవుడ్ లో వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు రావు రమేష్. విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోలందరితోనూ నటించారు రావు రమేష్. అందరితో చేశారు కానీ ఒక్క హీరోతో మాత్రం రావు రమేష్ నటించలేదు.. ఆ హీరో ఎవరో తెలుసా.?

విభిన్న పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు రావు రమేష్. కొత్తబంగారు లోకం సినిమా రావు రమేష్ కెరీర్ ను మార్చేసింది. ఆయన నటనకు మంచి గుర్తింపు తెచ్చింది ఆ సినిమా.. దాని తర్వాత రావురమేష్ ఎన్నో సినిమాల్లో నటించారు. తండ్రి, విలన్, కామెడీ విలన్ ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించారు రావురమేష్. ఇటీవలే ఆయన ప్రధాన పాత్రలో సినిమాలు కూడా వచ్చాయి. తనదైన డైలాగ్స్ తో మేనరిజంతో సహజమైన నటనతో పేక్షకులను ఆకట్టుకుంటున్నారు రావు రమేష్. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ, అల్లు అర్జున్ లాంటి బడా హీరోల సినిమాల్లో నటించిన రావు రమేష్ .. ఒక్క హీరోతో మాత్రం నటించలేదు. ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమున్నా ఎందుకో ఆయనతో నటించే అవకాశం రాలేదు.
మహేష్, పవన్ కళ్యాణ్ అలా.. ప్రభాస్ ఇలా..! స్టార్ హీరోల గురించి ప్రభాస్ శ్రీను ఏమన్నారంటే
ఆ హీరో ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. అవును రావు రమేష్ అందరు హీరోల సినిమాల్లో కనిపించారు కానీ ప్రభాస్ సినిమాలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీని గురించి గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. ప్రభాస్ అంటే చాలా ఇష్టం కానీ ఆయన సినిమాల్లో నటించే అవకాశం రాలేదు అని అన్నారు రావురమేష్. రాజా సాబ్ సినిమాలో మొదటిగా అనుకున్నారు కానీ ఆతర్వాత ఎందుకో సెట్ అవ్వలేదు అని అన్నారు రావు రమేష్..
ఆ టైంలో చనిపోతా అనుకున్నా.. ఆయనే సాయం చేశారు.. ఎమోష్నలైన పోసాని
అలాగే తనకు అందరు దర్శకుల సినిమాల్లో నటించడం అంటే చాలా ఇష్టమని.. ఎలాంటి పాత్ర అయినా చేస్తాను అని అన్నారు రావు రమేష్.. భవిష్యత్తులో ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వస్తుందేమో చూడాలి అని ఆశాభావం వ్యక్తం చేశారు రావు రమేష్. మారుతి దర్శకత్వంలో ప్రతిరోజు పండగే లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించారు రావు రమేష్. ఆ సినిమా ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. ఇక ప్రభాస్ విషయానికొస్తే ప్రస్తుతం రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు డార్లింగ్. ఈ సినిమా జనవరి 9న విడుదలకానుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఒకే రోజు పెళ్లి చేసుకున్న ప్రాణస్నేహితులు.. తెలుగులో ఇద్దరూ తోపులే.. వాళ్లు ఎవరంటే
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




