AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balagam Movie: అప్పుడే లాభాల బాట పట్టిన బలగం సినిమా.. మొదటి వారంలో ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

ప్రస్తుతం మనందరి జీవితాల్లో మాయమైపోతున్న కుటుంబ బంధాలను, ఆప్యాయతలను, ఎమోషన్స్‌ను కళ్లకు కట్టినట్లు చూపించారు ఈ చిత్రంలో. పలువురు సినీ ప్రముఖులు, విమర్శకులు కూడా ఈ చిన్న సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Balagam Movie: అప్పుడే లాభాల బాట పట్టిన బలగం సినిమా.. మొదటి వారంలో ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?
Balagam Movie
Basha Shek
|

Updated on: Mar 10, 2023 | 4:50 PM

Share

జబర్దస్త్ కమెడియన్‌ వేణు డైరెక్టర్‌గా మారి అదృష్టం పరీక్షించుకున్న మొదటి చిత్రం బలగం. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్పణలో ఆయ‌న కూతురు హ‌న్షిత‌, హ‌ర్షిత్‌రెడ్డి బ‌ల‌గం సినిమాను నిర్మించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 3న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. పైగా చిన్న సినిమా అని ట్యాగ్‌ కూడా ఇచ్చారు. అయితే రిలీజైన మొదటి షో నుంచే సూపర్ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది బలగం సినిమా. ప్రస్తుతం మనందరి జీవితాల్లో మాయమైపోతున్న కుటుంబ బంధాలను, ఆప్యాయతలను, ఎమోషన్స్‌ను కళ్లకు కట్టినట్లు చూపించారు ఈ చిత్రంలో. పలువురు సినీ ప్రముఖులు, విమర్శకులు కూడా ఈ చిన్న సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో రోజురోజుకూ ఈ సినిమా వసూళ్లు పెరుగుతున్నాయి. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వారం రోజుల్లోనే లాభాల బాట పట్టింది. మొదటి రోజు రూ.55 లక్షలు, రెండో రోజు రూ.80 లక్షలు రాబట్టగా మూడో రోజు వచ్చేసరికి ఏకంగా రూ.1.75 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు మొత్తంగా ఏడు కోట్ల మేర గ్రాస్‌ (రూ. 3.07 కోట్ల షేర్‌) రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక నిన్న (మార్చి 9) కూడా అర‌వై ల‌క్షల‌కుపైగా వసూళ్లు రాబ‌ట్టడం విశేషం.

ఇలా ఓవ‌రాల్‌గా కోటిన్నర ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో విడుదలైన బ‌ల‌గం సినిమా ఫ‌స్ట్ వీక్‌లోనే రూ.7 కోట్ల గ్రాస్‌ను, రూ.3 కోట్లకు పైగా షేర్‌ను రాబ‌ట్టింది. కాగా తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిన సినిమా కావడంతో నైజాం ఏరియాలో ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. ఇక ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని తాజాగా ఓ స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘ఇది మన విజయం.. కుటుంబ విజయం..చిన్న సినిమా అందరూ మెచ్చే గొప్ప సినిమా’ అంటూ సినిమాను సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. కాగా ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో అందించిన స్వరాలు చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి. అలాగే కాసర్ల శ్యాం అందించిన సాహిత్యం, మంగ్లీ ఆలపించిన పాటు బలగం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!
ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..
EPF వర్సెస్‌ VPF.. రెండింటికీ తేడా ఏంటి?
EPF వర్సెస్‌ VPF.. రెండింటికీ తేడా ఏంటి?
కిలో వెండి ధర రూ.2 లక్షల లోపు తగ్గుతుందా? భారీగా తగ్గనున్న బంగారం
కిలో వెండి ధర రూ.2 లక్షల లోపు తగ్గుతుందా? భారీగా తగ్గనున్న బంగారం
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు... నేడు తులం ధర ఎంత ఉందో తెలుసా?
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు... నేడు తులం ధర ఎంత ఉందో తెలుసా?
మీ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేశారా? నిమిషాల్లో కనిపెట్టేయండిలా!
మీ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేశారా? నిమిషాల్లో కనిపెట్టేయండిలా!