Tollywood: కథ బాగాలేదని కాలదన్నుకున్నారు.. కట్ చేస్తే.. ఆ హీరోకి ఇండస్ట్రీ హిట్
అన్నం మెతుకుల మీద తినేవారి పేరు రాసిఉన్నట్టే సినిమా కథ మీద కూడా నటించే వారి పేరు ముందే రాసి ఉంటుందంటారు. వెంకటేశ్ విషయంలో ఇదే నిజమైంది. ఎంతో మంది హీరోల చుట్టూ ప్రదక్షిణం చేసిన ఓ సినిమా కథ ఊహించని విధంగా ఈ విక్టరీ స్టార్ చేతిలో పడింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేనంత హోదా, స్టార్డం పొందాడు. అదే చంటి సినిమా. వెంకటేశ్ కెరీర్ ను గుర్రున తిప్పి నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ఈ సినిమాను ఎంత మంచి హీరోలు కాలదన్నుకున్నారో తెలుసా.. ?

“చంటి” సినిమా వెంకటేష్ కెరీర్‌లో అతిపెద్ద హిట్‌లలో ఒకటి. 1992లో విడుదలైన ఈ సినిమాలో మీనా హీరోయిన్‌గా నటించింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ చిత్రం “చిన్న తంబి”కి రీమేక్, ఇది భారీ విజయాన్ని సాధించింది. కె.ఎస్. రామారావు నిర్మించిన ఈ సినిమా అప్పట్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లతో సంచలనం క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమా ఇద్దరు స్టార్ హీరోలను దాటుకుని వెంకటేశ్ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా సెన్సేషన్ చూసి ఇలాంటి కథలతోనే సినిమాలు తీసినప్పట్టికీ అవి పెద్దగా ఆడలేదు. అంతటి ఇంపార్ట్ చూపించిన చంటి సినిమాను వదులుకున్నది ఎవరు..? చంటి సినిమా వెనకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇది..
తమిళ్ లో సూపర్ డూపర్ హిట్టైన చంటి సినిమా ఆ తర్వాత తెలుగుతో పాటుగా దాదాపు అన్ని భాషల్లోనూ విడుదలైంది.తెలుగులో ఈ సినిమా హిట్ ను ముందే ఊహించిన దర్శకనిర్మాతలు మొదట్లో ఈ కథను బాలకృష్ణకు చెప్పాలనుకున్నారు, కానీ సినిమా థీమ్ తన ఇమేజ్‌కి సరిపోదని భావించి ఆయన దానిని తిరస్కరించారు. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజశేఖర్‌ను సినిమా బృందం సంప్రదించింది. అతని “క్రేజీ స్టార్” ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రాజెక్ట్‌ను చేపట్టడానికి రాజశేఖర్ నిరాకరించాడు.
అటు తిరిగి ఇటు తిరిగి ఆ కథను రాజేంద్ర ప్రసాద్ కు అందించారు. ఆయనే కథానాయకుడిగా సినిమాను ప్రకటించారు కూడా. అయితే, చివరి నిమిషంలో, అతని స్థానంలో వెంకటేష్ ను తీసుకోవాలని బృందం నిర్ణయించింది. అప్పటికే కొత్త కొత్త కథలతో ఎక్స్ పరిమెంట్స్ చేస్తున్న వెంకీ ఈ ప్రాజెక్ట్ పట్ల ఉత్సాహంగా ఉన్నాడు. నేను చేస్తానంటూ ముందుకొచ్చాడు.
ఈ సినిమా పూర్తయి 1992 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. ఇది భారీ విజయాన్ని సాధించింది, కుటుంబ ప్రేక్షకులు దీనిని చూడటానికి థియేటర్లకు తరలివచ్చారు. ఈ సినిమా అపూర్వమైన విజయం సాధించింది, బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 16 కోట్లు సంపాదించి, ఆ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఆసక్తికరంగా, “చంటి” సినిమాను మొదట బాలకృష్ణ మరియు రాజశేఖర్ తిరస్కరించారు. రాజేంద్ర ప్రసాద్ ను హీరోగా ప్రకటించిన ఈ మూవీలో చివరి నిమిషంలో వెంకటేష్ పాల్గొనడం గేమ్-ఛేంజర్ గా మారింది. సినిమా విజయానికి ఆయన భాగస్వామ్యం కారణమని చెప్పవచ్చు.