F3 Movie Collections: నవ్వులు పూయిస్తూ.. కలెక్షన్స్ కురిపిస్తున్న ‘ఎఫ్3’.. ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే..
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్3 మూవీ ఈ నెల 12న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
విక్టరీ వెంకటేష్(Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun tej)నటించిన ఎఫ్3 మూవీ ఈ నెల 12న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. వెంకీ, వరుణ్ కామెడీకి సునీల్ తోడవవడంతో థియేటర్స్ లో నవ్వులు వర్షం కురుస్తుంది. వెంకీ మామ రేచీకటికి.. వరుణ్ ఖాక నత్తకి పడీ పడీ నవ్వుకుంటున్నారు ఆడియెన్స్. సీన్ సీన్‌కి.. స్క్రీన్ మీద పేలుతున్న పంచులకీ.. ఫన్ ఫుల్గా ఫీలవుతున్నారు ఇదే ఆడియన్స్. ఎఫ్ 2′ సినిమాలోని ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ను ఈసారి ‘ఎఫ్ 3’ లో డబ్బు నేపథ్యంలో చూపించారు దర్శకుడు అనిల్ రావిపూడి. మొదటి నుంచి ఈ సినిమా పై చాలా కన్ఫఇండెంట్ గా ఉన్నారు చిత్రయూనిట్. థియేటర్స్ లో ప్రేక్షకులు ఎఫ్ 3 సినిమాను అదే రేంజ్ లో ఆదరిస్తున్నారు ప్రేక్షకులు.ఇక ఈ సినిమా ఫస్ట్ డే నే మంచి వసూళ్లతో సత్తా చాటింది. ఇక ఈ మూవీ ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే..
తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఎఫ్ 3 రూ. 10.37 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే యూఎస్ఏలో గురువారం ప్రీమియర్లతో సహా మొదటి రోజు రూ. 500 కే డాలర్లకు పైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..నైజాం ౼ 4.06 కోట్లు.. UA ౼ 1.18 కోట్లు.. గుంటూరు ౼ 88 లక్షలు.. నెల్లూరు ౼ 62 లక్షలు.. తూర్పు ౼ 76 లక్షలు.. వెస్ట్ ౼ 94 లక్షలు.. కృష్ణ ౼ 67 లక్షలు.. సెడెడ్ ౼ 1.26 కోట్లు.. మొత్తం ఏపీ/తెలంగాణ కలిపి షేర్ ౼ 10.37 కోట్లు వసూల్ చేసింది ఎఫ్ 3 సినిమా. రానున్న రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరుగుతున్నాయంటున్నారు విశ్లేషకులు.
మరిన్ని ఇక్కడ చదవండి :