AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh : ఘనంగా వెంకటేశ్ రెండో కుమార్తె వివాహం.. ఫోటోస్ వైరల్..

గతేడాది అక్టోబర్ లో హవ్యవాహిని నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు చిరంజీవి, మహేష్ బాబు, రానా, నాగచైతన్య హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. వెంకటేశ్, నీరజ దంపతులకు నలుగురు సంతానం. ఆశ్రిత, హవ్యవాహిని, భావనతోపాటు.. కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం 2019లో జరిగింది.

Venkatesh : ఘనంగా వెంకటేశ్ రెండో కుమార్తె వివాహం.. ఫోటోస్ వైరల్..
Venkatesh Family
Rajitha Chanti
|

Updated on: Mar 16, 2024 | 6:34 AM

Share

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి బజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హవ్యవాహిని వివాహం విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు కుమారుడు డాక్టర్ నిషాంత్‏తో ఘనంగా జరిగింది. రామానాయుడు స్టూడియోలో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు వెంకటేశ్ కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గురువారం జరిగిన మెహందీ ఫంక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబసభ్యులు సందడి చేసిన సంగతి తెలిసిందే. మహేష్ సతీమణి నమ్రత.. ఆయన కూతురు సితార మెహందీ వేడుకలలో పాల్గొన్నారు.

గతేడాది అక్టోబర్ లో హవ్యవాహిని నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు చిరంజీవి, మహేష్ బాబు, రానా, నాగచైతన్య హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. వెంకటేశ్, నీరజ దంపతులకు నలుగురు సంతానం. ఆశ్రిత, హవ్యవాహిని, భావనతోపాటు.. కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం 2019లో జరిగింది. ప్రస్తుతం భర్తతో కలిసి విదేశాల్లో ఉంటున్నారు. ఆశ్రిత ఫుడ్ బ్లాగర్. భారతీయ ట్రెడిషనల్ ఫుడ్స్ తోపాటు.. విదేశీ వంటకాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలతో షేర్ చేసుకుంటారు. గతంలో రానా, నాగచైతన్య, వెంకీతో కలిసి వంటకాలకు సంబంధించిన వీడియోస్ చేశారు.

ఇక వెంకటేశ్ సినిమాల విషయానికి వస్తే.. చాలాకాలంగా వెంకీ సూపర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది సైంధవ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ సంక్రాంతి బరిలో విడుదలైన హనుమాన్, గుంటూరు కారం సినిమాలు కమర్షియల్ హిట్ కావడంతో వసూళ్ల విషయంలో సైంధవ్ వెనకబడింది. ఇందులో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..