Vakeel Saab: వకీల్ సాబ్‌ సెంచరీ కొడతారా..? పవన్ ఫ్యాన్స్ వంద కోట్ల కల నెరవేరుతుందా..?

హీరోగా తిరుగులేని మాస్‌ ఇమేజ్‌ ఉన్నా... పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ఖాతాలో వంద కోట్ల సినిమా ఇంత వరకు లేదు. పవన్...

  • Ram Naramaneni
  • Publish Date - 8:31 am, Thu, 15 April 21
Vakeel Saab: వకీల్ సాబ్‌ సెంచరీ కొడతారా..? పవన్ ఫ్యాన్స్ వంద కోట్ల కల నెరవేరుతుందా..?
Vakeel Saab

హీరోగా తిరుగులేని మాస్‌ ఇమేజ్‌ ఉన్నా… పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ఖాతాలో వంద కోట్ల సినిమా ఇంత వరకు లేదు. పవన్… ఫుల్‌ ఫాంలో ఉన్న టైంలో తెలుగు మార్కెట్ ఆ రేంజ్‌లో లేదు. తెలుగు మార్కెట్ వంద కోట్లు దాటే సమయానికి పవన్‌ సినిమాలు తగ్గించేశారు. దీంతో ఇంత వరకు పవర్‌ స్టార్ ఖాతాలో వంద కోట్ల సినిమా ఒక్కటి కూడా పడలేదు.

త్రీ ఇయర్స్‌ గ్యాప్‌ తరువాత పవన్‌ కల్యాణ్‌ నటించిన మూవీ వకీల్ సాబ్‌. బాలీవుడ్ బ్లాక్ బస్టర్‌ పింక్‌ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ టాలీవుడ్‌లోనూ రికార్డులు సృష్టిస్తోంది. తొలి రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తున్న వకీల్ సాబ్‌.. వందకోట్ల దిశగా దూసుకుపోతున్నారు. అయితే ఈ జోరుకు కరోనా బ్రేకులు వేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే వకీల్ సాబ్‌ సినిమా 75 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. కానీ ఆల్రెడీ కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి. దీనికి తోడు పెరుగుతున్న కరోనా కేసులతో ఆడియన్స్‌ కూడా తగ్గిపోతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో వకీల్ సాబ్‌ సెంచరీ కొడతారా..? పవన్ ఫ్యాన్స్ వంద కోట్ల కల నెరవేరుతుందా..? లెట్స్ వెయిట్ అండ్‌ సీ.

Also Read: బాలరామాయణం విడుదలై పాతికేళ్లు.. వెండితెరపై అద్భుతం చేసిన గుణశేఖర్

కౌలు రైతుగా మారిన సీబీఐ మాజీ జేడీ.. 10 ఎకరాల భూమిని బాడిగకు తీసుకుని వ్యవసాయం