Nagababu: మెగా బ్రదర్ నాగబాబు వాట్సాఫ్ డీపీ ఇదేనట.. ఆయన స్వయంగా తెలిపారు

మెగా బ్రదర్ నాగబాబు.. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా తెగ ట్రెండ్ అవుతున్నారు. ఒకవైపు పొలిటికల్ పంచ్‌లు పేలుస్తూ...

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు వాట్సాఫ్ డీపీ ఇదేనట.. ఆయన స్వయంగా తెలిపారు
Nagababu Dp
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 15, 2021 | 8:52 AM

మెగా బ్రదర్ నాగబాబు.. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా తెగ ట్రెండ్ అవుతున్నారు. ఒకవైపు పొలిటికల్ పంచ్‌లు పేలుస్తూ, మరోవైపు నెటిజన్లతో ముచ్చటిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. ‘Ask Me A Question’ పేరుతో  నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తన మార్క్ సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఓ ఫొటోను తన వాట్సాప్‌ డీపీగా పెట్టుకున్నట్లు చెప్పి నాగబాబు బాంబ్ పేల్చారు.  ఓ నెటిజన్‌.. ‘మీ వాట్సాప్‌ డీపీ ఏమిటి?’ అని ప్రశ్నించగా.. రామ్‌గోపాల్‌వర్మ, బాలకృష్ణ కలిసి దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశారు నాగబాబు. అయితే, గతంలో ఆర్జీవీ, బాలకృష్ణలపై నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో నాగబాబు.. తన వాట్సాప్‌ డీపీ గురించి వ్యంగ్యంగా సమాధానం ఇచ్చి ఉండవచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

 ‘Ask Me A Question’ భాగంగా ఓ నెటిజన్‌.. ‘మీది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా?’ అని ప్రశ్నించగా.. తనది పెద్దలు కుదిర్చిన వివాహమని ఆయన వెల్లడించారు. మరో ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ.. న్యూజిలాండ్‌ తనకెంతో ఇష్టమైన ప్రదేశమని అన్నారు. అనంతరం అల్లు అర్జున్‌ గురించి స్పందిస్తూ.. తన వరకూ బన్నీకి స్టైలిష్‌స్టార్‌ ట్యాగ్‌ బాగుంటుందని చెప్పారు.  అలాగే, సాయిధరమ్‌ తేజ్‌.. చాలా మంచి వ్యక్తని, కష్టపడే గుణం కలిగిన వ్యక్తి అని నాగబాబు చెప్పుకొచ్చారు.

Also Read: బాలరామాయణం విడుదలై పాతికేళ్లు.. వెండితెరపై అద్భుతం చేసిన గుణశేఖర్

కౌలు రైతుగా మారిన సీబీఐ మాజీ జేడీ.. 10 ఎకరాల భూమిని బాడిగకు తీసుకుని వ్యవసాయం