Bala Ramayanam: బాలరామాయణం విడుదలై పాతికేళ్లు.. వెండితెరపై అద్భుతం చేసిన గుణశేఖర్
ఒకరిద్దరు బాలనటులతో షూటింగ్ చెయ్యాలంటేనే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి డైరెక్టర్లకు. కానీ.. సినిమా మొత్తం చైల్డ్ ఆర్టిస్టులే వుంటే...?
ఒకరిద్దరు బాలనటులతో షూటింగ్ చెయ్యాలంటేనే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి డైరెక్టర్లకు. కానీ.. సినిమా మొత్తం చైల్డ్ ఆర్టిస్టులే వుంటే…? ఆ సాహసాన్ని కూడా అవలీలగా చేసి.. చరిత్ర సృష్టించారు కెప్టెన్ గుణశేఖర్. ఆ వండర్ జరిగి సరిగ్గా బుధవారానికి పాతికేళ్లు. 1996 ఏప్రిల్ 14… వెండితెర అద్భుతం బాలరామాయణం విడుదలైన రోజు. శబ్దాలయ థియేటర్స్ బేనర్‌పై ఎమ్‌ఎస్ రెడ్డి నిర్మించిన ఈ దృశ్యకావ్యం ఆసాంతం బాలనటులే కనిపిస్తారు. అప్పట్లో అదొక గ్రేట్ ఎక్స్‌పరిమెంట్. రాముడంటే రామారావే అనుకునే రోజుల్లో.. బాలరాముడిగా కనిపించారు జూనియర్ ఎన్టీఆర్. పెద్దపెద్ద కళ్లతో బాల సీతగా అందరి మనసూ దోచుకున్నారు స్మితా మాధవ్. తర్వాత ఆమె క్లాసికల్ డ్యాన్సర్‌గా సెటిలయ్యారు. నాటి మధుర జ్ఞాపకాల్ని ఇప్పటికీ మనసులో పదిలంగా దాచుకున్నారు.
లక్ష్మణుడిగా నారాయణమ్ నిఖిల్, హనుమంతుడి పాత్రలో అర్జున్ గంగాధర్, బుల్లి రావణాసురుడిగా స్వాతి బాలినేని… ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిన సునయన.. శబరిగా నటించారు. మల్లెమాల వారి యాక్టింగ్ క్లాసెస్‌లో ఆడుతుపాడుతూ పెరిగిన ఈ చిన్నారులంతా ఇప్పుడు అనేక రంగాల్లో బిజీగా వున్నారు. పెళ్లయి ఇద్దరు పిల్లల తండ్రయిన ఎన్టీయార్… ఈ పాతికేళ్లలో 29 సినిమాలు చేసి.. టాప్ స్టార్ల లిస్టులోకెక్కేశారు.
ఆవిధంగా ఒక మెమరబుల్ మైథాలజీ ఫిలిమ్ చేసిన డైరెక్టర్ గుణశేఖర్.. పాతికేళ్ల తర్వాత మరోసారి మైథాలజీ వైపు ఫోకస్ చేశారు. సమంత టైటిల్‌రోల్‌లో శాకుంతలం మూవీ చేస్తున్నారు. ఎంతయినా… నాటి బాలరామాయణం తెలుగు పరిశ్రమలో అజరామరం.
Also Read: ‘మందగా ఉంటే ఆ బలమే వేరప్పా’… సింహాన్ని చీల్చి చెండాడిన గేదెలు.. స్పాట్ డెత్
తూర్పుగోదావరి జిల్లా మానేపల్లిలో సక్కర్ ఫిష్ కలకలం.. తోటి చేపల్ని, జీవుల్నీ ఇది మింగేస్తుంది