AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varudu Kavalenu: వరుడు కావలెను నుంచి మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న వడ్డాణం పాట..

యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం వరుడు కావలెను. ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా రూపొందుతున్న

Varudu Kavalenu: వరుడు కావలెను నుంచి మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న వడ్డాణం పాట..
Varudu Kavalenu
Rajitha Chanti
|

Updated on: Oct 02, 2021 | 11:45 AM

Share

యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం వరుడు కావలెను. ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా రూపొందుతున్న ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ..సినిమా పై ఆసక్తిని కలిగిస్తున్నారు మేకర్స్. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన దిగు దిగు నాగ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్.

తాజాగా ఈ సినిమా నుంచి వడ్డాణం అనే ఫన్ అండ్ పెప్పీ పాటను విడుదల చేసింది చిత్రూయనిట్. వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు..వయ్యారం చిందేసే అందాల బొమ్మలు అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విడుదలైన కాసేపటికే యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమానే కాకుండా.. టు సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో లక్ష్య సినిమా చేస్తున్నాడు.. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శౌర్యకు జోడీగా కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నవంబర్ 12న విడుదల కానుంది.

వీడియో..

Also Read: Annatthe: విడుదలకు సిద్ధమైన SP బాలు పాట.. అన్నాత్తే నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..

Rashi Khanna: చేదుగా ఉండే కాఫీ మన మార్నింగ్స్‌ను స్వీట్‌గా ఎలా మారుస్తుందో కదా.! ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన ముద్దుగుమ్మ..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?