Uppena Krithi Shetty : తన కోరికను నెర‌వేర్చే వారికోసం ఎదురు చూస్తోన్న కృతిశెట్టి.. ఇంత‌కా కోరికేంటో తెలుసా?

|

May 05, 2021 | 5:45 AM

Uppena Krithi Shetty : ఒక్క సినిమతో ప‌ది సినిమాల క్రేజ్ సొంతం చేసుకుంది అందాల తార కృతిశెట్టి. ఉప్పెన సినిమాలో త‌న‌దైన క్యూట్ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఈ చిన్న‌ది తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఓవైపు అందంతో..

Uppena Krithi Shetty : తన కోరికను నెర‌వేర్చే వారికోసం ఎదురు చూస్తోన్న కృతిశెట్టి.. ఇంత‌కా కోరికేంటో తెలుసా?
Krithy Shetty
Follow us on

Uppena Krithi Shetty : ఒక్క సినిమతో ప‌ది సినిమాల క్రేజ్ సొంతం చేసుకుంది అందాల తార కృతిశెట్టి. ఉప్పెన సినిమాలో త‌న‌దైన క్యూట్ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఈ చిన్న‌ది తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఓవైపు అందంతో ఆక‌ట్టుకుంటూనే మ‌రోవైపు న‌ట‌న‌తో ఆక‌ర్షించిందీ ముద్దుగుమ్మ‌. ఉప్పెన సినిమా విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించిన కృతిశెట్టికి వ‌రుసపెట్టి ఆఫ‌ర్లు త‌లుపుత‌డుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించిన ఈ చిన్న‌ది ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది.
సోష‌ల్ మీడియాలో మీకు ఉన్న కోరిక ఏంటి అని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు కృతిశెట్టి స‌మాధాన‌మిస్తూ.. త‌న‌కు సొంతంగా తెలుగులో డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌ని ఉంద‌ని చెప్పుకొచ్చింది. ఆ కోరిక నెర‌వేర్చే ద‌ర్శ‌కుడి కోసం ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపింది. మ‌రి తెలుగులో మాట్లాడ‌డంలో కృతి శెట్టి ఏమేర ప్రాక్టిస్ చేస్తుందో తెలియాల్సి ఉంది. ఇక తెలుగు ఇండ‌స్ట్రీ త‌న‌కు బాగా న‌చ్చింద‌ని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ.. ఒక్క సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ను త‌నపై చూపిన అభిమానానికి ఎంతో సంతోషంగా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చింది. ఇక కృతిశెట్టి న‌టిస్తోన్న సినిమాల విష‌యానికొస్తే ఈ చిన్న‌ది ప్ర‌స్తుతం నాని హీరోగా తెర‌కెక్కుతోన్న శ్యామ్ సింగ రాయ్‌తో పాటు.. సుధీర్ బాబు న‌టిస్తోన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల్లో న‌టిస్తోంది. మ‌రి కృతి త‌న డ‌బ్బింగ్ కోరిక‌ను తీర్చే డైరెక్ట‌ర్ ఎవ‌రో చూడాలి.

Also Read: బాలీవుడ్‏లో కరోనా కలకలం.. కోవిడ్ బారిన పడ్డ దీపిక పదుకొనే.. ఆసుపత్రిలో హీరోయిన్ తండ్రి..

Allu Arjun: ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌లో అల్లు అర్జున్‌.. డైరెక్టర్ గా ఎవరంటే.?

జోరుమీదున్న వైష్ణవ్ తేజ్.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్న మెగా మేనల్లుడు.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్..