Uppena Director With NTR: యంగ్‌ టైగర్‌తో చేతులు కలపనున్న ‘ఉప్పెన’ డైరెక్టర్‌.. పీరియడ్‌ స్పోర్ట్స్‌ డ్రామగా..

Uppena Director With NTR: సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చి బాబు సానాల దర్శకుడిగా మారి తెరెక్కించిన సినిమా 'ఉప్పెన'. ఇంటెన్సివ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం..

Uppena Director With NTR: యంగ్‌ టైగర్‌తో చేతులు కలపనున్న 'ఉప్పెన' డైరెక్టర్‌.. పీరియడ్‌ స్పోర్ట్స్‌ డ్రామగా..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 19, 2021 | 12:25 PM

Uppena Director With NTR: సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చి బాబు సానాల దర్శకుడిగా మారి తెరెక్కించిన సినిమా ‘ఉప్పెన’. ఇంటెన్సివ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం నమోదు చేసుకుంది. లాక్‌డౌన్‌ తర్వాత భారీ విజయాన్ని అందుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌కు కూడా ఈ సినిమా మంచి ఆరంభాన్ని అందించింది. ఇక ‘ఉప్పెన’ సక్సెస్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు ఈ యంగ్‌ డైరెక్టర్‌. ఈ క్రమంలోనే బుచ్చి బాబుతో పనిచేయడానికి చాలా మంది నిర్మాతలు, హీరోలు ఆసక్తిచూపిస్తున్నారని తెలుస్తోంది. కింగ్‌ నాగార్జున ఏకంగా అఖిల్‌ కోసం ఓ అందమైన ప్రేమ కథను సిద్ధం చేయమని బుచ్చి బాబును అప్రోచ్‌ అయ్యారని కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త దర్శకుడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే చాన్స్‌ను కొట్టేసినట్లు తెలుస్తోంది. గతంలో సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు బుచ్చిబాబు సహాయక దర్శకుడిగా పనిచేశాడు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని ఈ కారణంగానే ఎన్టీఆర్‌ బుచ్చిబాబుకు చాన్స్‌ ఇస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను ప్లాన్‌ చేస్తోందని. విశాఖపట్నం నేపథ్యంలో పీరియడ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారని టాక్‌ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: ‘Pogaru’ Movie Review : మాస్ ఆడియన్స్ ఆకలి తీర్చే యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘పొగరు’..

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..