Upendra: భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన హీరో ఉపేంద్ర..
దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఆడియో సంస్థ అయిన 'లహరి మ్యూజిక్' చలనచిత్ర నిర్మాణంలోకి ప్రవేశిస్తుంది. 'లహరి ఫిలిమ్స్ LLP'తోపేరుతో "వీనస్ ఎంటర్‌టైనర్స్‌తో కలిసి..
Upendra: దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఆడియో సంస్థ అయిన ‘లహరి మ్యూజిక్’ చలనచిత్ర నిర్మాణంలోకి ప్రవేశిస్తుంది. ‘లహరి ఫిలిమ్స్ LLP’తోపేరుతో “వీనస్ ఎంటర్‌టైనర్స్‌తో కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. పాన్-ఇండియా నటుడు, దర్శకుడు అయిన ఉపేంద్ర సహకారంతో ఈ మూవీ రూపొందించనుంది. గతంలో ఉపేంద్ర దర్శకత్వం వహించిన “ష్”, “ఎ”, “ ?” వంటి టైటిల్‌ల గురించి అందరికీ తెలిసిందే. ఆయా సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఉపేంద్ర.. అవి దక్షిణాన కల్ట్ క్లాసికల్ మెగా హిట్స్‌గా నిలి చాయి. ఇప్పుడు కన్నడ, హిందీ, తెలుగు, తమిళం వంటి నాలుగు భాషలలో గొప్ప కంటెంట్‌తో ఈ పాన్-ఇండియా చిత్రం ద్వారా మొత్తం భారతీయ ప్రేక్షకులను అలరించడానికి మొదటిసారి చేతులు కలిపారు. బాహుబలి, KGF, ఇటీవలి విజయం సాధించిన పుష్ప తరహాలోనే ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి,ఈ మూవీ త్వరలో సెట్స్‌కి వెళ్లడానికి సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా నటుడు, దర్శకుడు, ఉపేంద్ర మాట్లాడుతూ..ఈ పాన్-ఇండియన్ చిత్రానికి పనిచేయడానికి నేను చాలా ఉత్సాహంగా వున్నాను. భారీ సంస్థల నిర్మాణంలో క్రేజ్ కలిగించే ఈ సినిమా మొత్తం భారతీయ ప్రేక్షకులు ఇష్టపడతారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. 33 ఏళ్లుగా “ఉపేంద్ర” కథను సృష్టించినా స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాసిన అభిమానులే కారకులు. వారి ఈలలు కరతాళాలు నన్ను దర్శకత్వం వహించేలా చేశాయి. అందుకే ఈ చిత్రాన్ని భారతీయ సినీ అభిమానులకు `ప్రజా ప్రభు`గా అంకితం చేస్తున్నాను. అన్నారు.
లహరి మ్యూజిక్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి మనోహరన్ మాట్లాడుతూ..గత 25 సంవత్సరాలుగా సంగీత ప్రియుల కోసం పనిచేసిన తర్వాత మేము ఈ అసోసియేషన్ కోసం ఎదురుచూశాం. లహరి సంస్థ ఉపేంద్ర తొలి చిత్రం “A” నుండి మద్దతు ఇస్తోంది. ఆ సినిమా దక్షిణాదిలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ప్రపంచ ప్రేక్షకుల దృష్టి ఆకర్షించిన ఆయన చిత్రాలను మేము ఆస్వాదించాం. ఇప్పుడు భారతదేశం, విదేశాలలో మొత్తం భారతీయ ప్రేక్షకులు అతని సినిమాలను ఆస్వాదించాలని కోరుకుంటున్నాము.
మరిన్ని ఇక్కడ చదవండి :