Sankranthi Movies: సంక్రాంతికి స్టార్ హీరోల పోటీ.. చిరంజీవి, వెంకటేశ్ పోటీగా ఆ యంగ్ హీరో..

ఇయర్‌ ఎండింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ... సంక్రాంతికి రానున్న సినిమాల మీద ఫోకస్‌ గట్టిగా పడుతోంది. వస్తామన్న సినిమాలెన్ని? వచ్చే సినిమాలెన్ని? అందులో తమ అభిమాన హీరో చిత్రం ఉందా? లేదా? అంటూ అప్పుడే ఆరాలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది ఏఏ సినిమాలు రానున్నాయో తెలుసా. ?

Sankranthi Movies: సంక్రాంతికి స్టార్ హీరోల పోటీ.. చిరంజీవి, వెంకటేశ్ పోటీగా ఆ యంగ్ హీరో..
Chiranjeevi

Edited By: Rajitha Chanti

Updated on: Sep 11, 2025 | 10:15 PM

వచ్చే సంక్రాంతికి వస్తున్నానని చెప్పకనే చెప్పేశారు హీరో విక్టరీ వెంకటేష్‌. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న మనశంకరవరప్రసాద్‌గారు మూవీలో గెస్ట్ రోల్‌ చేస్తున్నారు వెంకీ. మెగాస్టార్‌తో అనిల్‌ రావిపూడి ఎలాంటి మేజిక్‌ చేస్తారో చూడటానికి వెయిటింగ్‌ అంటున్నారు జనాలు. సంక్రాంతికి పలకరించే ఛాన్స్ ఏమాత్రం ఉన్నా… మిస్‌ చేసుకోరు హీరో రవితేజ. కిశోర్‌తిరుమల దర్శకత్వంలో రవితేజ నటించే సినిమా సంక్రాంతికి ముస్తాబవుతోందని న్యూస్‌. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కావడంతో, పండక్కి పర్ఫెక్ట్ మూవీ అని భావిస్తున్నారట మేకర్స్.వాల్తేరు వీరయ్య వైబ్స్ ని గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?

స్టార్‌ హీరోల సినిమాలు ఎన్నుంటే ఏంటి.. కంటెంట్‌తో క్లిక్‌ అయ్యే సినిమాలకు పండగ సీజన్‌లో ఎప్పుడూ ప్లేస్‌ ఉంటూనే ఉంటుంది. దాన్ని ఈ సారి నేను ఫిలప్‌ చేస్తానని చెబుతున్నారు నవీన్‌ పొలిశెట్టి. ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో ఈ సారి బరిలోకి దూకుతున్నారు నవీన్‌.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‏కు ప్రపంచమే జై కొట్టింది..

ఈ సారి మన సినిమాలతో పాటు జనాలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో సినిమా జననాయగన్. విజయ్‌ సినీ కెరీర్‌లో లాస్ట్ సినిమాగా పాపులర్‌ అవుతోందీ మూవీ. జనవరి 9న దళపతి క్రేజ్‌ చూడటానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..