AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎప్పుడైనా ఎగ్ పకోడి ట్రై చేశారా? వర్షం పడుతుంటే తిన్నారో.. ఆహా అనాల్సిందే!

మృగశిర కార్తె ప్రారంభానికి ముందే తెలుగు రాష్టాల్లో తొలకరి చినుకులు పడుతున్నాయి. ఇక చాలా మందికి వర్షం పడుతుంటే వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా మిర్చీ బజ్జీ, పకోడీ లాంటివి ఎక్కువ ఇష్టంగా తింటారు. అయితే ఎప్పుడూ రోటీన్‌గా కాకుండా, మీరు ఎప్పుడైనా ఎగ్ పకోడీ చేశారా? అయితే ఈ సారి ట్రై చేయండి. ఎగ్ పకోడీ ఇలా చేశారంటే, ఇంట్లో ఉన్నవారంతా ఆహా అనుకుంటూ తింటారంట. కాగా, ఈ రిసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 04, 2026 | 5:06 PM

Share
కావాల్సిన పదార్థాలు : కోడి గుడ్లు మూడు, పావు కప్పు శనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఒక పెద్ద ఉల్లిపాయ (పొడవుగా కట్ చేసి పొరలు విడదీయాలి), రెండు పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి),సన్నగా తరిగిన కొత్తిమీర, అర టీ స్పూన్ కారంపొడి, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ వాము, పావు టీ స్పూన్ పసుపు,  వేయించడానికి సరిపడా నూనె.

1 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే..ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో మూడు గుడ్లను తీసుకుని బాగా బీట్ చేయాలి. బీట్ చేసిన గుడ్లలో పావు కప్పు శనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండివేసి బాగా కలపాలి. ఇప్పుడు పొడవుగా తరిగిన ఉల్లిపాయలను వేసుకుని, వాటి పొరలను విడదీయాలి. తరువాత, సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి కొత్తిమీర, వేసుకోవాలి.

2 / 5
అలాగే మంచి  రుచి కోసం అర టీ స్పూన్ కారంపొడి, తగినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ వాము, పావు టీ స్పూన్ పసుపు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి  పకోడీ తయారు చేసుకునే విధానంలో పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసుకోవాలి. ఎప్పుడైనా సరే నూనె బాగా వేడి అయిన తర్వాత పకోడీ వేసుకోవాలి. అప్పుడే ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఉంటుంది. నూనె బాగా వేడి అయిన తర్వాత మంట కాస్త చిన్నగా పెట్టుకొని, మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని, పకోడిలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి.

4 / 5
వేసిన తర్వాత రెండు నిమిషాల తర్వాత పకోడి కాస్త కాలుతుంది. తర్వాత దానిని అటు  ఇటూ తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత పకోడి పూర్తిగా ఉడికి, వేగిపోతుంది. బంగారు రంగులో కనిపిస్తుంది. అప్పుడు వాటిని తీసి వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. పైన కాస్త ధనియాల పొడి జల్లించుకోవాలి. కొన్ని తరిగిన ఆనియన్స్ కలుపుకొని, వర్షం పడుతున్న సమయంలో వేడి వేడిగా తింటే రుచి మర్చిపోలేరు.

5 / 5
Follow Us