AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఉమ్మడి నల్లగొండ జిల్లా దర్శకులకు ‘ఫాల్కే’ అవార్డు..

తెలుగు చిత్ర సీమలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కత్తి కాంతారావు, ప్రభాకర్ రెడ్డి వంటి తారలు ఎందరో మెరిశారు. ప్రస్తుతం కూడా ఎంతోమంది కళాకారులు పలు రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు సినీ దర్శకులు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు.

Tollywood : ఉమ్మడి నల్లగొండ జిల్లా దర్శకులకు 'ఫాల్కే' అవార్డు..
Tollywood
M Revan Reddy
| Edited By: |

Updated on: May 04, 2025 | 6:07 PM

Share

తెలుగు చిత్ర సీమలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కత్తి కాంతారావు, ప్రభాకర్ రెడ్డి వంటి తారలు ఎందరో మెరిశారు. ప్రస్తుతం కూడా ఎంతోమంది కళాకారులు పలు రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు సినీ దర్శకులు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు.

ఇది కూడా చదవండి :థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఆ అమ్మడి స్పెషల్ సాంగ్..

ఇటీవల కాలంలో తెలుగు చిత్ర సీమలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన  కళాకారులు రాణిస్తున్నారు. 24 క్రాఫ్ట్ లలో తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన యాట సత్యనారాయణ దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తెలంగాణలో జరిగిన రజాకార్ల దుశ్చర్యలపై, సాయుధ రైతాంగ గెరిల్లా పోరాటంపై రూపొందిన చిత్రానికి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను భువనగిరి చెందిన బీజేపీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. మొదటి సారి దర్శకత్వం వహించిన వారి కేటగిరీలో యాట సత్యనారాయణ ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు.

ఇది కూడా చదవండి : ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఆమె ఎవరంటే

యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లికి చెందిన బడుగు విజయ్‌కుమార్‌ కూడా అవార్డు దక్కింది. స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా భూదాన్‌ పోచంపల్లికి చెందిన యువ దర్శకుడు బడుగు విజయ్‌కుమార్‌ ‘యూనిటీ ది మ్యాన్‌ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’ డాక్యుమెంటరీ చిత్రానికి ఉత్తమ దర్శకుడి కేటగిరీలో దాదాసాహెబ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ఢిల్లీలో జరిగిన దాదా సాహెబ్‌ ఫాల్కే15వ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 200 చిత్రాలను ప్రదర్శించగా 25 చిత్రాలు వివిధ కేటగిరీలలో అవార్డుకు ఎంపికయ్యాయి. అందులో ఉత్తమ దర్శకులుగా యాట సత్యనారాయణ, బడుగు విజయ్‌కుమార్‌ ఎంపికయ్యారు. ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో యాట సత్యనారాయణ, బడుగు విజయ్‌కుమార్‌ అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే