AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Malla Reddy: పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‏గా మల్లారెడ్డికి డైరెక్టర్ ఆఫర్.. మంత్రి రియాక్షన్ ఏంటంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో తనకు ప్రతినాయకుడిగా ఛాన్స్ వచ్చిందని.. కానీ దానిని రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

Minister Malla Reddy: పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‏గా మల్లారెడ్డికి డైరెక్టర్ ఆఫర్.. మంత్రి రియాక్షన్ ఏంటంటే..
Mallareddy, Pawan Kalyan
Rajitha Chanti
|

Updated on: Mar 26, 2023 | 3:34 PM

Share

ఇటీవల సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తన మాటలతో తెగ ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా ఆయన చెప్పే డైలాగ్స్ నెట్టింట చక్కర్లు కొట్టాడు. ఆయన చెప్పే డైలాగ్స మీమ్స్, రీల్స్ గా తెగ ట్రెండ్ అవుతుంటాయి. మరోవైపు ఆయనపై ట్రోలింగ్ వచ్చినా.. పాజిటివ్‏గా తీసుకుంటారు. తనముందే తనను ఇమిటేట్ చేసిన చిరునవ్వుతో స్వీకరిస్తారు. తాజాగా మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు మల్లారెడ్డి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో తనకు ప్రతినాయకుడిగా ఛాన్స్ వచ్చిందని.. కానీ దానిని రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఇటీవల మేమ్ ఫేమస్ సినిమా ప్రమోషన్లలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మల్లారెడ్డి. ఈ వేడుకలో మాట్లాడుతూ తనకు వచ్చిన సినిమా ఆఫర్ గురించి చెప్పుకొచ్చారు. “మధ్యపానం, ధూమపానం, షికార్లు, అమ్మాయిల వెంటపడడం.. ఇలాంటివి చేస్తే ఫేమస్ కారు. కష్టపడి పనిచేస్తేనే సక్సెస్ అవుతారు. పాలమ్మిన.. పూలమ్మిన. కాలేజీలు పెట్టిన.. టాప్ డాక్టర్లను.. సైంటిస్టులను తయారు చేశాను. అదీ ఫేమస్. కాబట్టి యువత కష్టపడి పనిచేసి అన్నింటా విజయాన్ని అందుకోవాలి. ప్రస్తుతం యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఏ ఒక్కరు షార్ట్ కట్ లో సక్సెస్ కాలేరు. 23 ఏళ్ల వయసులో నాకు పెళ్లి అయ్యింది. అప్పుడు నా వద్ద ఏమీ లేదు. పాలు అమ్ముకునేవాడిని. కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యాను. కాబట్టి ఇప్పటికైనా షికార్లు బంద్ చేసి జీవితంలో ముందుకెళ్లడం పై దృష్టిపెట్టార. నాకు ఈ సినిమా టీజర్ నచ్చింది. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇది అయ్యాక ఈ హీరోతో నేనొక సినిమా చేస్తాను. అలాగే ఎన్నికలు అయిపోయాక పలు తెలంగాణ యాసలో చిత్రాలు నిర్మాను. మొన్న డైరెక్టర్ హరీష్ శంకర్ మా ఇంటికి వచ్చాడు. గంటన్నర బతిమిలాడాడు. పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా చేయమని.. కానీ చెయనని చెప్పాను” అంటూ చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.

View this post on Instagram

A post shared by TV9 Telugu (@tv9telugu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.