
డైరెక్టర్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన బలగం సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీకి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్స్ అందుకుంది. మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో వచ్చిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది. పట్టణం నుంచి పల్లె వరకు ప్రతి ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. తాజాగా తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ బలగం సినిమా గురించి ప్రస్తావించారు. కొద్ది రోజులుగా తెలంగాణ వర్షకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార మంత్రులు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి చెప్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పల్లెల అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ఇటీవల సూపర్ హిట్ అయిన బలగం మూవీ గురించి మాట్లాడారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. “ఒకప్పుడు కరువు, కటిక నేలల్లో షూటింగ్ చేయాలంటే సినిమా వాళ్లు రాయలసీమతోపాటు తెలంగాణను చూపించేవాళ్లు. కానీ.. ఇప్పుడు పల్లె అందాల కోసం తెలంగాణలోని పల్లెటూళ్లను వెతుకుతున్నారు. మా సిరిసిల్ల బిడ్డ వేణు ఎల్దండి బలగం అనే సినిమా తీశాడు. ఆ మూవీ ప్రమోషన్లకు నన్ను పిలిస్తే.. ఫంక్షన్ సిరిసిల్లలో పెట్టు అని చెప్పినా.. ఈ సినిమాలో అనుబంధాలు, మానవ సంబంధాలు బాగా చూపించారు. ఊళ్లన్నీ ఆ సినిమాను పండగలా చూశాయి. దిల్ రాజు వాళ్ల అమ్మాయి ఈ సినిమాను నిర్మించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంలో జరిగింది ఆ మూవీ షూటింగ్. నేను నా కుటుంబంతో కలిసి చూశాను. సినిమాలో చూపించిన గ్రామం నిజంగా సిరిసిల్లదేనా.. తెలంగాణ గ్రామమేనా.. అది కోనరావుపేటనా.. కోనసీమనా అని అడిగారు. కరువు సీమలు ఇప్పుడు కోనసీమలు అయ్యాయి” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.
The impact of #Balagam speaks volumes 💯
Thank you Minister @KTRBRS garu for acknowledging our efforts and encouraging us to push our boundaries ❤️
We couldn’t have achieved this without our lovely Telugu audience! 🙌#BalagamGoesGlobal@DilRajuProdctns pic.twitter.com/1erJCF2ufc
— Dil Raju Productions (@DilRajuProdctns) August 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.