AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood New Trend: టాలీవుడ్‌లో నయా ట్రెండ్.. యంగ్ హీరోలకు ఆ స్టోరీలే కావాలట..!

Tollywood Buzz: టాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా యంగ్ హీరోలు తమ స్టోరీస్ విజయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు. సక్సస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా కొత్త కథలే కావాలంటున్నారు. అంటే ఇప్పుడు చేస్తున్న సినిమాకి, నెక్స్ట్ మూవీకి ఏ మాత్రం సంబంధమే ఉండకూదని కోరుకుంటున్నారు యంగ్ హీరోలు. అప్పుడే కొత్త ప్రాజెక్ట్‌కి ఓకే చెబుతున్నారు.

Tollywood New Trend: టాలీవుడ్‌లో నయా ట్రెండ్.. యంగ్ హీరోలకు ఆ స్టోరీలే కావాలట..!
Tollywood Young Heroes
Satish Reddy Jadda
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 19, 2025 | 6:22 PM

Share

సక్సెస్, ఫెయిల్యూర్‌ తో సంబంధం లేదు.. కొత్త కథలే కావాలంటున్నారు యంగ్ హీరోలు. సెట్స్ మీద ఉన్న సినిమాకు ఆ తరువాత చేయబోయే సినిమాకు సంబంధమే ఉండకూడదని ఫీల్ అవుతున్నారు. ఒక్కో సినిమాను ఒక్కో జానర్‌ లో ట్రై చేస్తూ ఆడియన్స్‌ కు డిఫరెంట్స్ ఎక్స్‌ పీరియన్స్ ఇచ్చేందుకు కష్టపడుతున్నారు. ఈ లిస్ట్‌ లో అందరికంటే ముందున్న హీరో నాని. నేచురల్‌ స్టార్ లైనప్‌ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. దసరా లాంటి రా సినిమా తరువాత, హాయ్‌ నాన్న లాంటి క్లాస్‌ మూవీ, ఆ తరువాత సరిపోదా శనివారం లాంటి కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌, నెక్ట్స్ యాక్షన్ డ్రామా హిట్ 3 , త్వరలో ది ప్యారడైజ్ అంటూ మరో రా మూవీ ఇలా వేరియేషన్స్‌ లోనూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు నేచురల్ స్టార్‌.

నాని తరువాత ఆ రేంజ్‌ లో వేరియేషన్స్ చూపిస్తున్న మరో యంగ్ హీరో నిఖిల్‌. స్పై యాక్షన్‌, రొమాంటిక్ డ్రామా, ఫోక్‌ లోర్‌, ఫాంటసీ… ఇలా ఒక్కో సినిమాను ఒక్కో జానర్‌ లో ట్రై చేస్తున్నారు నిఖిల్‌. సక్సెస్‌ ఫెయిల్యూర్‌ తో సంబంధం లేకుండా ప్రతీ సినిమాను డిఫరెంట్ జానర్‌ లోనే ట్రై చేస్తున్నారు ఈ యంగ్ హీరో. నిఖిల్‌ నే ఫాలో అవుతన్న మరో యంగ్ హీరో వరుణ్ తేజ్‌. రీసెంట్‌ టైమ్స్‌ లో ఒక్కో సినిమాను ఒక్కో డిఫరెంట్‌ జానర్‌ లో ట్రై చేస్తున్నారు వరుణ్‌. స్పోర్ట్స్‌ డ్రామా, ఏరియల్ యాక్షన్‌, పీరియాడిక్ క్రైమ్ డ్రామా ఇలా డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు వరుణ్‌.

ఇన్నాళ్లు కమర్షియల్ ట్రెండ్‌ లోనే ఉన్న విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు రూటు మార్చారు. ప్రజెంట్ విజయ్‌ కిట్టీలో ఉన్న ఒక్కో సినిమా ఒక్కో జానర్‌ ఒక్కో టైమ్‌ పీరియడ్‌. ఈ సినిమాల కోసం డిఫరెంట్ లుక్స్‌, డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్‌ ట్రై చేస్తున్నారు రౌడీ హీరో.  అక్కినేని యంగ్ హీరోలు కూడా డిఫరెంట్‌ గానే ట్రై చేస్తున్నారు. ఎక్కువగా క్లాస్ మూవీస్ చేసే నాగచైనత్య రీసెంట్‌ గా తండేల్‌ లో మాస్ జానర్‌ లోకి అడుగుపెట్టారు. నెక్ట్స్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఫాంటసీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అఖిల్ కూడా రొమాంటిక్ డ్రామా, స్పై థ్రిల్లర్, వింటేజ్ లవ్‌ స్టోరీ ఇలా డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు.

ఈ ట్రెండ్‌ ను ఆడియన్స్‌ను కూడా ఫుల్‌ గా ఎంజాయ్ చేస్తున్నారు. రొటీన్ ఫార్ములా సినిమాలతో బోర్ ఫీల్ అవ్వకుండా డిఫరెంట్ జానర్స్‌, డిఫరెంట్‌ వరల్డ్స్ లో జరిగే కథను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ సక్సెస్‌ పరంగా కూడా ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుందంటున్నారు క్రిటిక్స్‌.