Kedar Selagamsetty : ఇండస్ట్రీలో విషాదం.. విజయ్ దేవరకొండ నిర్మాత కన్నుమూత..
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. యంగ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి అనుహ్య పరిస్థితుల్లో కన్నుమూశారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆయన దుబాయ్ లో మరణించినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రీలోని యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి కన్నుమూసినట్లు సమాచారం. దుబాయ్ లో ఆయన మంగళవారం మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా సినిమాకు కేదార్ నిర్మాతగా వ్యవహరించారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, బన్నీ వాసు, ఆనంద్ దేవరకొండకు కేదార్ అత్యంత సన్నిహితులు అని సమాచారం. బన్నీ వాసు ప్రొద్బలంతోనే కేదార్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. గతంలోనూ ముత్తయ్య అనే సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేశా సినిమాను నిర్మించారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యారు. డైరెక్టర్ సుకుమార్, విజయ్ కాంబోలో రాబోతున్న సినిమాను కేదార్ నిర్మించనున్నారు. ఇప్పటికే సుకుమార్ కు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అనుహ్య పరిస్థితుల్లో ఆయన మరణానికి సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలోని చాలా మంది దుబాయ్ లోనే ఉన్నారు.
ఓ నిర్మాత కొడుకు పెళ్లికి దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆ వివాహానికి కెదార్ వెళ్లాడా.. ? ఇటీవల జరిగిన పాక్ ఇండియా మ్యాచ్ కోసం వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..




