Tollywood : మాస్ మసాలా సినిమాల కంటే లవ్ స్టోరీలే ముద్దు అంటున్న యంగ్ హీరోలు..
టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలై ప్రేక్షకులు మెప్పిస్తున్నాయి. యంగ్ హీరోలు ఇప్పుడు ఎక్కువగా లవ్ స్టోరీస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. స్టార్ హీరోలు మాస్ యాక్షన్ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు.

ఈ మధ్య ఎక్కువగా మాస్ సినిమాలే కదా వస్తున్నాయి.. పైగా మన హీరోలంతా కత్తులు, గన్నులు పట్టుకుని బాగా రఫ్‌గా మారిపోయారు. అందుకే కాస్త ట్రాక్ మార్చి.. సాఫ్ట్ కథల వైపు వెళ్తున్నారు కొందరు హీరోలు. చాలా రోజుల తర్వాత తెలుగులో కొన్ని ప్రేమ కథలు వస్తున్నాయి. పైగా అవన్నీ క్రేజీ హీరోలే చేస్తున్నవే. మరి ప్రేమ పాఠాలు చెప్తున్న ఆ హీరోలెవరు..? చూస్తున్నారా సిద్ధూ జొన్నలగడ్డ ఎంత రొమాంటిక్‌గా కనిపిస్తున్నారో..? డిజే టిల్లుతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ హీరోకు జాక్‌తో అనుకోని ఫ్లాప్ ఎదురైంది. దాంతో తనకు కలిసొచ్చిన రొమాన్స్ వైపు అడుగులేస్తున్నారు సిద్ధూ. నీరజ కోన తెరకెక్కిస్తున్న తెలుసు కదా..లో రాశీ ఖన్నా, శ్రీనిథి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 17న విడుదల కానుంది ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.
సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే
కేవలం సిద్ధూ మాత్రమే కాదు.. మరికొందరు కుర్ర హీరోలు కూడా ప్రేమకథలతోనే వస్తున్నారు. ఎప్పుడూ థ్రిల్లర్స్ చేసే అడివి శేష్ సైతం డెకాయిట్‌తో ప్రేక్షకులకు కొత్త రకం ప్రేమకథను పరిచయం చేయబోతున్నారు. రామ్ పోతినేని దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఆంధ్రా కింగ్ తాలూకలో సాఫ్ట్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాతో రైటర్, సింగర్‌గా మారిపోయారు రామ్.
అనుకున్నదొక్కటీ అయ్యిందొక్కటి..! ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. మొదటి వారం బయటకు వచ్చేది ఆమె..
శర్వానంద్ సైతం సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజుతో నారినారి నడుమ మురారి అనే క్యూట్ లవ్ స్టోరీ చేస్తున్నారు. అలాగే నవీన్ పొలిశెట్టి సంక్రాంతికి అనగనగా ఒకరాజు అంటూ మీనాక్షి చౌదరితో వస్తున్నారు. కిరణ్ అబ్బవరంతో చెన్నై లవ్ స్టోరీ అనే ప్రేమకథను తీసుకొస్తుంది బేబీ టీం. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్‌లో ప్రేమకథలు కనిపిస్తున్నాయి. మరో వైపు స్టార్ హీరోలు యాక్షన్ సినిమాలకు ఒకే చేస్తూ దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలు లవ్ స్టోరీలు ఓకే చేస్తూ రాణిస్తున్నారు.
ఛీ ఛీ.. ఇదేం పాడు సినిమారా బాబు.! డైరెక్టర్‌ను పిచ్చి కొట్టుడు కొట్టారు.. హీరోయిన్‌పై కూడా దాడి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








