Tollywood: ఈ చిన్నోడు తెలుగునాట బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన హీరో.. కనిపెట్టారా..?

ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా..? తెలుగులో హీరోగా మంచి విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు సరైన కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఓ నటినే పెళ్లాడాడు. ఇంకా క్లూ కావాలంటే బిగ్ బాస్ ఇంట్లో కూడా కొన్నాళ్లు ప్రేక్షకులను అలరించాడు. ఇన్ని క్లూలు ఇచ్చినా మీరు కనిపెట్టలేకపోయారా..?

Tollywood: ఈ చిన్నోడు తెలుగునాట బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన హీరో.. కనిపెట్టారా..?
Hero Childhood Photo
Follow us

|

Updated on: Apr 01, 2023 | 6:55 PM

చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎదుగుతారో, ఎవ్వరు ఎప్పుడు కనుమరుగు అవుతారో అస్సలు చెప్పలేం. ప్రతి శుక్రవారం ఇక్కడ జీవితాలు తారుమారు అవుతుంటాయి. సినిమా హిట్టయితే పలువురు ఫేమస్ అవుతారు.. డిజాస్టర్ అయితే కొందరు పత్తాలేకుండా పోతారు. అదన్నమాట సంగతి. అలానే కెరీర్ స్టార్టింగ్‌లో లవర్ బాయ్ అనే పేరు తెచ్చుకుని వరుస హిట్స్ అందుకున్న ఓ హీరో.. ఇప్పుడు సరైన హిట్టు లేక సతమతమవుతున్నాడు. ఎప్పుడు హిట్టు పడుతుందా.. మళ్లీ ఎప్పుడు ట్రాక్‌లోకి వస్తామా అని ఎదురుచూస్తున్నాడు. పైన ఫోటోలోని బుడ్డోడే ఆ హీరో. అతడిని మీరు కనిపెట్టారా..? పోలికలు గమనిస్తే కాస్త ఈజీగా పట్టేయవచ్చు.

కనిపెడతే ఫైన్.. లేదంటే మేమే చెప్పేస్తాం. అందులోని బుడ్డోడు వరుణ్ సందేష్. ‘హ్యాపీడేస్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ సందేశ్.. ఆ తర్వాత నటించిన ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈ కుర్ర హీరో చేసిన సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. ఏమైంది ఈవేళ మాత్రమే కొద్దో, గొప్పో ఆడింది. కొంతమంది ప్రముఖ దర్శకులు, నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేసినా అదృష్టం దక్కలేదు. వరుణ్ నటించిన “యద్భావం తద్భవతి” అనే సినిమా విడుదల కావాల్సి ఉంది. ‘చిత్రం చూడరా’ అనే మూవీ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఇదైనా అతడి ఫేట్ మారుస్తుందేమో చూడాలి.

ఇక ఈ యువ హీరో.. నటి వితికా షేరును పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆమెతో కలిసి బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కి జోడి ఎంట్రీ ఇచ్చి.. మళ్లీ కాస్త యాక్టివ్ అయ్యాడు. వరుణ్ సందేశ్ ఫేమస్ రైటర్ జీడిగుంట రామచంద్రమూర్తి మనవడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.