Tollywood: జోరుపెంచిన టాలీవుడ్.. షూటింగ్స్ బిజీబిజీగా హీరోలు.. ఏ సినిమా ఎక్కడ జరుగుతుందంటే
ముఖ్యంగా సంక్రాంతి హీరోలైతే పగలు రాత్రి కష్టపడుతున్నారు. సంక్రాంతి సినిమాల షూటింగ్ వేగంగా జరుగుతుంది. వాల్తేరు వీరయ్య కోసం ఫ్రాన్స్ వెళ్లారు చిరంజీవి.
ఎన్టీఆర్ ఎప్పట్లాగే ఇంకా కొరటాల కోసం వేచి చూస్తున్నారు.. మహేష్ బాబు మాత్రం కలిసిరాని ఏడాది షూటింగ్ వద్దనుకున్నారు.. రామ్ చరణ్ బ్రేక్ నుంచి ఇంకా రాలేదు.. నాగార్జున, వెంకటేష్ ఏ సినిమా చేయాలో నిర్ణయించుకోలేదు.. వీళ్ళు కాకుండా మిగిలిన హీరోలంతా సెట్‌లోనే గడిపేస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి హీరోలైతే పగలు రాత్రి కష్టపడుతున్నారు. సంక్రాంతి సినిమాల షూటింగ్ వేగంగా జరుగుతుంది. వాల్తేరు వీరయ్య కోసం ఫ్రాన్స్ వెళ్లారు చిరంజీవి. అక్కడే శృతిహాసన్‌తో రెండు వారాలు డ్యూయెట్స్ పాడుకోనున్నారు మెగాస్టార్. ఈ రెండు పాటలతో వాల్తేరు వీరయ్య షూటింగ్ పూర్తి కానుంది. ఇక వీరసింహారెడ్డి షూటింగ్ పూర్తి కావడంతో.. అనిల్ రావిపూడి సినిమాతో బాచుపల్లిలో బిజీగా ఉన్నారు బాలయ్య.
అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ ఎర్రమంజిల్ కాలనీలో జరుగుతుంది. మొన్నటి వరకు ప్రాజెక్ట్ కేతో బిజీగా ఉన్న ప్రభాస్.. తాజాగా మారుతి ప్రాజెక్ట్‌కు షిఫ్ట్ అయ్యారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ నానక్‌రామ్ గూడలో జరుగుతుంది. తొలి షెడ్యూల్‌లో పాల్గొనని ప్రభాస్.. రెండో షెడ్యూల్‌లో జాయిన్ అవుతున్నారు. ఇక హరిహర వీరమల్లుతో బిజీగా ఉన్నారు పవన్. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. చంద్రముఖి 2 షూటింగ్ కూడా అక్కడే జరుగుతుంది.
నాగ చైతన్య సినిమా షూటింగ్ కోకాపేట పరిసర ప్రాంతాల్లో.. సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు 2 సినిమా షూటింగ్ చిరాన్ పోర్ట్‌లో.. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష షూటింగ్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. రామ్, బోయపాటి సినిమా తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్ర షూటింగ్ అంబేద్కర్ యూనివర్సీలో జరుగుతుంది.ఇలా టాలివుడ్ లో రాబోతున్న సినిమా షూటింగ్స్ అన్ని చక చక జరుగుతున్నాయి.