మరీ ఇంత ఆలస్యంగానా? టాలీవుడ్ సూపర్‌స్టార్‌పై ట్రోలింగ్స్..

క్రికెట్ వరల్డ్‌కప్ మ్యాచ్ హ్యంగోవర్ ఇంకా దిగలేదు. ఇంగ్లాండ్ కప్ గెలుచుకుంది. న్యూజిలాండ్ మనసు గెలుచుకుంది. ఇలా ట్వీట్ చేశాడు సూపర్ స్టార్ మహేశ్‌బాబు. దాంతో అంతా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మ్యాచ్ గురించి పొగిడితే.. ఎందుకు ట్రోల్ చేయడం అనుకుంటున్నారా? దానికో లెక్క ఉంది. మ్యాచ్ ఆదివారం రాత్రి జరిగింది. మహేష్‌బాబు సోమవారం అర్ధరాత్రి ట్వీట్ చేశాడు. మరి ట్రోలింగ్ ఉండదా? మహేష్‌బాబు మంచి ఉద్దేశంతోనే ట్వీట్ చేశాడు. కానీ టైమింగ్ రాంగ్. మ్యాచ్ ఫలితం […]

మరీ ఇంత ఆలస్యంగానా?   టాలీవుడ్ సూపర్‌స్టార్‌పై ట్రోలింగ్స్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 17, 2019 | 11:05 AM

క్రికెట్ వరల్డ్‌కప్ మ్యాచ్ హ్యంగోవర్ ఇంకా దిగలేదు. ఇంగ్లాండ్ కప్ గెలుచుకుంది. న్యూజిలాండ్ మనసు గెలుచుకుంది. ఇలా ట్వీట్ చేశాడు సూపర్ స్టార్ మహేశ్‌బాబు. దాంతో అంతా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మ్యాచ్ గురించి పొగిడితే.. ఎందుకు ట్రోల్ చేయడం అనుకుంటున్నారా? దానికో లెక్క ఉంది. మ్యాచ్ ఆదివారం రాత్రి జరిగింది. మహేష్‌బాబు సోమవారం అర్ధరాత్రి ట్వీట్ చేశాడు. మరి ట్రోలింగ్ ఉండదా? మహేష్‌బాబు మంచి ఉద్దేశంతోనే ట్వీట్ చేశాడు. కానీ టైమింగ్ రాంగ్. మ్యాచ్ ఫలితం వచ్చిన 24 గంటల తర్వాత స్పందించడంతో.. ఇపుడే నిద్రలేచారా అంటూ ట్రోల్ మొదలైంది. మహేష్‌బాబు షూటింగ్ బిజీలో ఉండి లేట్‌గా స్పందించాడమో.. కానీ ట్రోలర్స్ ఊరుకోరు కదా. అదే జరిగింది.

మహేష్‌ సోషల్ మీడియాలో చాల యాక్టివ్. తన సినిమాలను ట్విట్టర్ ద్వారా ప్రమోట్ చేయడం తనకు బాగా అలవాటు. ఏడు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. టాలీవుడ్ హీరోల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అయితే అప్పుడప్పుడు ఇలాంటి ట్వీట్స్‌తో బుక్కయిపోతుంటాడు. ఆ మధ్య ప్రతిరోజు సెలబ్రేటింగ్ మమర్షి అంటూ ప్రతిదానికి ట్వీట్ చేసినప్పుడు కూడా ఇలాగే ట్రోలింగ్ జరిగింది,.