Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేశ్‌కు భారీ షాక్‌.. ఏడాది జైలు శిక్ష, జరిమానా.. ఎందుకంటే?

తాజాగా ఇదే కేసు విషయమై ఒంగోలు కోర్టుకు హాజరయ్యారు బండ్ల గణేశ్. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. బండ్ల గణేశ్‌కు ఏడాది పాటు జైలు శిక్షను ఖరారు చేసింది. 30 రోజుల్లో 95 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కోర్టు ఖర్చులకు గానూ అదనంగా 10 వేలు కూడా చెల్లించాలని తీర్పులో పేర్కొంది.

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేశ్‌కు భారీ షాక్‌.. ఏడాది జైలు శిక్ష, జరిమానా.. ఎందుకంటే?
Bandla Ganesh

Updated on: Feb 14, 2024 | 2:02 PM

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్‌ నాయకుడు బండ్ల గణేశ్‌కు జైలు శిక్ష పడింది. చెక్‌ బౌన్స్‌ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు బుధవారం (ఫిబ్రవరి 14) తీర్పునిచ్చింది. శిక్షతో పాటు బండ్లగణేశ్‌కు రూ. 95 లక్షల జరిమానా కూడా విధించింది. అలాగే కోర్టు ఖర్చులు కూడా భరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేసు వివరాల్లోక వెళితే.. బండ్ల గణేశ్‌కు ఒంగోలుకు చెందిన జెట్టి వెంకటేశ్వర్లకు గత కొన్నేళ్లుగా ఆర్థిక సంబంధమైన వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే ఎంతకీ ఈ వివాదాలు సమసిపోవడం లేదు. ఇదే వ్యవహారమై 95 లక్షల రూపాయల చెక్ బౌన్స్ అయిందంటూ వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. గత కొద్దికాలంగా ఒంగోలు కోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. తాజాగా ఇదే కేసు విషయమై ఒంగోలు కోర్టుకు హాజరయ్యారు బండ్ల గణేశ్. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. బండ్ల గణేశ్‌కు ఏడాది పాటు జైలు శిక్షను ఖరారు చేసింది. 30 రోజుల్లో 95 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కోర్టు ఖర్చులకు గానూ అదనంగా 10 వేలు కూడా చెల్లించాలని తీర్పులో పేర్కొంది. అయితే ఈ తీర్పుపై 30 రోజుల్లో పై కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చని ఒంగోలు న్యాయస్థానం తెలిపింది. బండ్ల గణేశ్ కూడా ఒంగోలు కోర్టు తీర్పును ఎగువ కోర్టుకు అప్పీలు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

కమెడియన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు బండ్ల గణేశ్‌. స్టార్‌ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ ను స్థాపించాడు. రవితేజ, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, పవన్‌ కల్యాణ్‌ వంటి అగ్రహీరోలతో సినిమాలు తీశాడు. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగానే ఉంటున్నారాయన. రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కూడా పోటీచేసే అవకాశముందని వార్తలొచ్చాయి. అయితే ఇంతలోనే చెక్‌ బౌన్స్‌ కేసుతో చిక్కుల్లో పడ్డాడీ స్టార్‌ ప్రొడ్యూసర్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.