- Telugu News Photo Gallery Cinema photos Shruti Haasan and Nayanthara Latest Movie Updates From film industry
Movie Updates: లోకేష్ మూవీలో శ్రుతి.. మళ్లీ అమ్మవారి పాత్రలో నయనతార.?
2023లో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, హాయ్ నాన్న, సలార్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు కమల్‌హాసన్ డాటర్ శ్రుతిహాసన్. 2024లోనూ వెరైటీ కంటెంట్‌తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. వీటిలో ఓ ప్రాజెక్ట్ లో శ్రుతితో కలిసి లోకేష్ నటిస్తున్నారు. కమల్ నిర్మిస్తున్నారు. ఈ తరం హీరోయిన్లలో మైథలాజికల్ సబ్జెక్టులను కూడా అడపాదడపా టచ్ చేస్తున్న నాయికగా పేరుంది నయనతారకు. ఆల్రెడీ మూకుత్తి అమ్మన్ సినిమాలో నటించి మెప్పించారు నయన్. శ్రీరామరాజ్యంలో సీతాదేవిగానూ ప్రశంసలు అందుకున్నారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Feb 14, 2024 | 1:54 PM

Shruti Haasan

ప్రేమ గొప్పతన్నాన్ని చెప్పేలా శ్రుతిహాసన్ ఓ పాటను రాసి, కంపోజ్ చేశారు. ఈ మ్యూజికల్ ఆల్బమ్‌లో శ్రుతితో కలిసి లోకేష్ తెరపై కనిపిస్తారు. లోకేష్ హీరోగా నటిస్తారంటూ ఇప్పటికే చాలా సార్లు వార్తలొచ్చాయి. వాటిని లోకేష్ ఎప్పుడూ కొట్టిపారేయలేదు. నియర్ ఫ్యూచర్‌లో అన్బరివు డైరక్షన్లో ఓ సినిమా చేస్తారనే టాక్ కూడా స్పీడ్‌గానే స్ప్రెడ్ అవుతోంది.

ఈ తరం హీరోయిన్లలో మైథలాజికల్ సబ్జెక్టులను కూడా అడపాదడపా టచ్ చేస్తున్న నాయికగా పేరుంది నయనతారకు. ఆల్రెడీ మూకుత్తి అమ్మన్ సినిమాలో నటించి మెప్పించారు నయన్. శ్రీరామరాజ్యంలో సీతాదేవిగానూ ప్రశంసలు అందుకున్నారు. లేటెస్ట్ గా అలాంటిదే మరో సినిమాలో నటిస్తారంటూ నయన్ పేరు మారుమోగుతోంది.

ఆడివెళ్లి అనే సినిమా రీమేక్‌లో నయనతార నటిస్తారన్నది వైరల్ న్యూస్. అప్పట్లో తమిళంలో సూపర్‌డూపర్ హిట్ అయింది ఆ సినిమా.తెలుగులోనూ శ్రావణ శుక్రవారం పేరుతో రిలీజ్ అయి జనాదరణ పొందింది. ఈ సినిమాలో నయన్ అమ్మవారి రోల్‌లో సందడి చేస్తారనే విషయం నిజమేనా అనే విషయంపై నిర్మాత తేనాండాళ్ మురళి స్పందించారు.

సినిమాను రీమేక్ చేస్తున్నమాట నిజమే, నయనతారగారు చేస్తే బావుంటుందని మేం భావిస్తున్నాం. ఇంకా ఆమెను అప్రోచ్ కాలేదు, కథాపరమైన మార్పులన్నీ పగడ్బంధీగా పూర్తయ్యాక వెళ్లి కలవాలని అనుకుంటున్నామని చెప్పారు మురళి. సో అదీ సంగతి.. బాల్ ఇంకా నయన్ కోర్టుకి చేరలేదన్నమాట.





























