- Telugu News Photo Gallery Cinema photos Heroine Trisha Krishnan to replace Nayanthara in senior star heroes movies after Ponniyin Selvan success Telugu Actress Photos
Trisha Krishnan – Nayanthara: త్రిష కారణంగా అయోమయంలో పడిన నయన్.! గ్లామర్ ప్లస్ టాలెంట్‌తో చెన్నై చంద్రం.
నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ అన్నా.. లేడీ ఓరియంటెడ్ మూవీ అన్నా నయనతారే ఫస్ట్ ఛాయిస్‌గా కనిపించేవారు. కాస్త యాక్షన్ కూడా ఉన్న లేడీ ఓరియంటెడ్ మూవీ అయితే అనుష్క పేరు తెర మీదకు వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్లకు చెక్ పెట్టేస్తున్నారు ఓ సీనియర్ బ్యూటీ. ఎవరుకుంటున్నారా..? పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గానీ త్రిష ఇమేజ్‌ను మాత్రం పూర్తిగా మార్చేసింది.
Updated on: Feb 14, 2024 | 3:03 PM

నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ అన్నా.. లేడీ ఓరియంటెడ్ మూవీ అన్నా నయనతారే ఫస్ట్ ఛాయిస్‌గా కనిపించేవారు. కాస్త యాక్షన్ కూడా ఉన్న లేడీ ఓరియంటెడ్ మూవీ అయితే అనుష్క పేరు తెర మీదకు వచ్చేది.

కానీ ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్లకు చెక్ పెట్టేస్తున్నారు ఓ సీనియర్ బ్యూటీ. ఎవరుకుంటున్నారా..? పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గానీ త్రిష ఇమేజ్‌ను మాత్రం పూర్తిగా మార్చేసింది.

నిన్న మొన్నటి వరకు కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఫిక్స్ అయిన త్రిష.. ఈ సినిమా సక్సెస్ తరువాత మళ్లీ స్టార్ హీరోలకు జోడిగా మారారు. ప్రజెంట్ మెగాస్టార్ మూవీలో నటిస్తున్నారు ఈ బ్యూటీ.

పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ తరువాత విజయ్, లోకేష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావటంతో మరోసారి ఈ చెన్నై చంద్రం పేరు సౌత్ సర్కిల్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది అదే స్థాయిలో ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి.

వెండితెర మీద త్రిష జోరు చూపిస్తుండటంతో అదే సెగ్మెంట్‌లో పోటి పడుతున్న మిగతా హీరోయిన్లకు ఇబ్బందులు తప్పట్లేదు. ఇన్నాళ్లు సీనియర్ హీరో సినిమా అంటే హీరోయిన్‌గా నయన్ పేరు తెర మీదకు వచ్చేది.

కానీ ఇప్పుడు ఆ ప్లేస్‌లో త్రిష పేరు వినిపిస్తోంది. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే అనుష్కతోనే అని ఫిక్స్ అయ్యారు సౌత్ మేకర్స్.

ఇప్పుడు ఆ థాట్స్‌కు చెక్ పెడుతూ తాను కూడా యాక్షన్ మూవీస్ చేయగలనని ప్రూవ్ చేశారు. గ్లామర్ ప్లస్ టాలెంట్‌తో వెండితెర మీద నయా ఇన్సింగ్స్‌ను కంటిన్యూ చేస్తున్నారు చెన్నై చంద్రం.




