AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చివరకు నన్నే మోసం చేశారు..! డబ్బులు ఇస్తే గాని ఇంటర్వ్యూలు చెయ్యరా.?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే తనదైన ముద్రవేసిన యంగ్ హీరో తిరువీరు. ఇప్పుడిప్పుడే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన తిరువీర్.. ఆ తర్వాత హీరోగా మారారు. 2016లో బొమ్మలరామారం సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు.

చివరకు నన్నే మోసం చేశారు..! డబ్బులు ఇస్తే గాని ఇంటర్వ్యూలు చెయ్యరా.?
Thiruveer
Rajeev Rayala
|

Updated on: Jan 31, 2026 | 10:32 AM

Share

తెలుగులో ఎంతోమంది టేలెంటెడ్ యంగ్ హీరోలు సినిమాలతో మెప్పిస్తున్నారు. వారిలో తిరువీర్ ఒకరు. మసూద సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు తిరువీర్. ఇటీవలే ప్రీవెడ్డింగ్ షూట్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు, అలాగే ఇప్పుడు ఓ సుకుమారి అనే సినిమాలో నటిస్తున్నాడు. తిరువీర్ తన కొత్త చిత్రం టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొని, తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రమోషన్స్, మార్కెటింగ్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మాతలు సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత, ముఖ్యంగా ప్రమోషన్ల దశకు వచ్చేసరికి ఆర్థికంగా అలసిపోతున్నారని, ఇది సినిమా ఫలితాలపై ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు..

తాను చేసిన మాసూద, పరేషాన్ వంటి చిత్రాలే తనను ఎంచుకున్నాయని, తాను ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాలేదని తిరువీర్ స్పష్టం చేశారు. ప్రీ-వెడ్డింగ్ వంటి చిన్న చిత్రాలకు ఎంత అవసరమో అంతే ప్రచారం చేశారని, అయితే భగవంతుడు తన కెరీర్‌లోనే పెద్ద సినిమా కావడంతో ప్రమోషన్లు మరింత ముఖ్యమని ఆయన అన్నారు.  ప్రీ-వెడ్డింగ్ సమయంలో తాను కారులో తిరుగుతూ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ప్రచారం చేశానని గుర్తుచేసుకున్నారు. మీడియా సపోర్ట్ చేసిందని, అయితే కొన్ని ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ప్రమోషన్లకు డబ్బు చెల్లించాల్సి వస్తుందనినేను విన్నాను.

గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..

ప్రతిసారీ నిర్మాతలు ప్రమోషన్లకు డబ్బులు ఉన్నాయని హామీ ఇస్తారు.. కానీ చివరకు నేను మోసపోతున్నాను, చివరికి డబ్బులు లేవని, మార్కెట్ బాగాలేదని చెప్పి నిరాశ పరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను అనేక సార్లు మోసపోయానని, ఈ పరిస్థితి 2026 నుండి పునరావృతం కాకూడదని ఆకాంక్షించారు. అయితే, మీడియాకు డబ్బు ఇవ్వాల్సివస్తుందన్నది నిర్మాతలు తనకు చెప్పిన సమాచారమేనని తిరువీర్ స్పష్టం చేశారు. తనకు మీడియాలో కొంతమంది వ్యక్తిగతంగా తెలుసునని, వారెప్పుడూ డబ్బు అడగలేదని అన్నారు. ప్రమోషన్ల విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్లను ధైర్యంగా వెల్లడించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

చూడటానికి పెద్ద అంకుల్.. కానీ నాతో అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..