ఓటీటీలోకి శ్రీవిష్ణు ‘గాలి సంపత్’… విడుదలైన రెండో వారంలోనే డిజిటల్ మీడియాలోకి.. తేదీ ఎప్పుడంటే..
టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు.. లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా 'గాలి సంపత్'. శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు
టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు.. లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా ‘గాలి సంపత్’. శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పకుడిగా వ్యవహించడంతోపాటు.. స్క్రీన్ ప్లై, దర్శకత్వం పర్యవేక్షణ కూడా నిర్వహించాడు. అనిల్ కో-డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో కలిసి అనీష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలా ఉంటే విడుదలైన రెండో వారంలోనే ఈ మూవీ ఓటీటీలోకి ప్రవేశిస్తుంది.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో మార్చి 19న ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇందుకోసం ఆహా టీం చిత్రయూనిట్ డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆహా సంస్థ తమ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాలి సంపత్.. ఫి. ఫి.. ఫీ… అంటూ గాలి భాషను ప్రేక్షకులకు పరిచయడంలో సక్సెస్ అయినా.. కలెక్షన్లు రాబట్టడంలో మాత్రం వెనకబడిపోయింది. దీంతో నిర్మాతలు ఓటీటీ వైపు ఆసక్తి చూపారు. సినిమా విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో విడుదలవుతుంది. ఇక ఈ సినిమా విషయానికోస్తే.. ఒక తండ్రీ, కొడుకుల మధ్య నడిచే ఎమోషనల్ కథ. రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు తండ్రీకొడుకులు. ఇద్దరివి వేర్వేరు దారులు. ఇద్దరికి క్షణం కూడా పడదు.
A fa fa fa faaa fun-filled entertainer coming your way!! #GaaliSampath premieres March 19, only on #ahavideoIN.@sreevishnuoffl #DrRajendraPrasad @AnilRavipudi @lovelysingh0508 @YoursSKrishna @achurajamani pic.twitter.com/Q2snVooOT4
— ahavideoIN (@ahavideoIN) March 16, 2021
Also Read:
మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్.. మొదటి సారి మన్మధుడితో జతకట్టనున్న చందమామ..
చీరకట్టులో మెరిసిన ‘చందమామ’…గట్టి పోటీ ఇచ్చిన అక్కినేనివారి కోడలు..తగ్గేది లేదంటూ..