AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా క్రేజీ అప్‏డేట్.. విడుదల తేదీని ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‏తోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా క్రేజీ అప్‏డేట్.. విడుదల తేదీని ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..
Ntr Trivikram
Rajitha Chanti
|

Updated on: Mar 17, 2021 | 2:49 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‏తోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు జక్కన్న. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.  ఏప్రిల్‌ నెలలో వారం పాటు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత ఎన్టీఆర్‌ మే, జూన్‌ నెలల్లో సినిమా కోసం పూర్తిగా డేట్స్‌ కేటాయిస్తాడని సమాచారం.

ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తైన వెంటనే ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్‏లో పాల్గొననున్నాడు. ఏప్రిల్ 19 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు), కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయాలని భావిస్తున్నాడ డైరెక్టర్. సాధ్యమైనంత తొందరగా ఈ సినిమాను పూర్తిచేసి.. ఏప్రిల్‏లో విడుదల చేయాలని భావిస్తున్నాడట. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమా టైటిల్‏కు సంబంధించి ఎలాంటి అప్‏డేట్ రాలేదు. ఆ తర్వాత ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. గతంలో వీరిద్దరీ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీళ్ళ కాంబోలో రాబోతున్న సినిమాపై అభిమానులకు అంచనాలు భారీగానే ఉన్నాయి.

Also Read:

ఓటీటీలోకి శ్రీవిష్ణు ‘గాలి సంపత్’… విడుదలైన రెండో వారంలోనే డిజిటల్ మీడియాలోకి.. తేదీ ఎప్పుడంటే..

చీరకట్టులో మెరిసిన ‘చందమామ’…గట్టి పోటీ ఇచ్చిన అక్కినేనివారి కోడలు..తగ్గేది లేదంటూ..

నేచురల్ స్టార్ రంగంలోకి అర్జున్ రెడ్డి.. ‘శ్యామ్ సింగరాయ్’‏లో కీలకపాత్రలో విజయ్ ?

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్