నేచురల్ స్టార్ రంగంలోకి అర్జున్ రెడ్డి.. ‘శ్యామ్ సింగరాయ్’‏లో కీలకపాత్రలో విజయ్ ?

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ తెరకెక్కిస్తున్న సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఇందులో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా

నేచురల్ స్టార్ రంగంలోకి అర్జున్ రెడ్డి.. 'శ్యామ్ సింగరాయ్'‏లో కీలకపాత్రలో విజయ్ ?
Nani Vijay Devarakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 17, 2021 | 6:41 AM

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ తెరకెక్కిస్తున్న సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కోడుతుంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా క్లైమాక్స్‏లో ఓ గెస్ట్ రోల్ ఉందట. ఇక ఆ పాత్రలో ఓ ఫేమస్ హీరో కనిపించబోతున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ పాత్రలో నారా రోహిత్ కనిపించబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా టాక్ వినిపించింది. అయితే ఆ గెస్ట్ రోల్ లో నారా రోహిత్ కాకుండా విజయ్ దేవరకొండ నటించబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ విజయ్ దేవరకొండను ఈ సినిమా గురించి అప్రోచ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండే ఇటీవలే నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించిన జాతి రత్నాలు సినిమాలో విజయ్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ క్లైమాక్స్ సీన్‏లో గెస్ట్ రోల్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. శ్యామ్ సింగరాయ్ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఒక పురాతనమైన కోటలోనే ఉండబోతుందట. ఇక ఇందులో నాని పాత్రకు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అద్బుతంగా ఉండబోతున్నట్లుగా సమాచారం.ఈ మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మిక్కిజేమేయర్ సంగీతం అందిస్తుండగా.. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అటు విజయ్.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఇందులో విజయ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఈ సినిమాను చార్మీ, కరణ్ జోహార్‏లు సంయుక్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 9న విడుదల కానుంది.

Also Read:

Kajal Aggarwal: గౌతమ్‌కు నేనంటేనే ఇష్టం.. ఆయనకు వేరే ఆప్షన్‌ లేదు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన కాజల్‌..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!