మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్.. మొదటి సారి మన్మధుడితో జతకట్టనున్న చందమామ..
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత జోరు పెంచింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తొంది.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత జోరు పెంచింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తొంది. అంతేకాకుండా.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న మోసగాళ్లు సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.
నాగార్జున పాత్రలో.. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగ్ సరసన కాజల్ నటించనుందట. ఈ సినిమాకు కాజల్ ఓకే చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ గోవాలో జరుగుతుంది. గోవా షెడ్యూల్ పూర్తైన తర్వాత మిగిలిన చిత్రీకరణ కోసం నాగ్ టీం హైదరాబాద్‌కు రానుంది. మార్చి 31 నుంచి ఈ సినిమా చిత్రీకరణంలో కాజల్ పాల్గొననున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శరత్ మరార్.. సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఇటీవలే నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తిచేసుకున్నాడు. ఇందులో నాగ్ ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ‘హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేళుళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే ‘వైల్డ్ గాడ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ బాంబులను పెట్టిన ఉగ్రవాదులను పట్టుకోవడమే కథాంశంగా ఈ సినిమా ఉంటుంది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. నిజానికి ఈ సినిమాను తొలుత ఓటీటీ వేదికగా విడుదల చేయాలని భావించారు. కానీ లాక్‌డౌన్ ఎత్తివేయడం, థియేటర్లు మళ్లీ ప్రారంభం కావడంతో చిత్ర యూనిట్ తమ ఆలోచనను మార్చుకుంది. అటు కాజల్ తెలుగులోనే కాకుండా తమిళంలోనూ రెండు సినిమాలకు ఓకే చెప్పిందట. అంతేకాకుండా.. ఈ టీవి షోకు కూడా హోస్ట్ గా చేయనున్నట్లుగా సమాచారం.
Also Read:
చీరకట్టులో మెరిసిన ‘చందమామ’…గట్టి పోటీ ఇచ్చిన అక్కినేనివారి కోడలు..తగ్గేది లేదంటూ..
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నాగార్జున.. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చిన హీరో..