Nandamuri Balarkishna: మరోసారి మంచి మనసు చాటుకున్న బాలకృష్ణ.. చిన్నారి క్యాన్సర్ పేషేంట్‌కు చికిత్స కోసం ఆర్ధిక సాయం

Nandamuri Balarkishna: ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు,  ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడే కాదు..తమ అభిమానులు ఇబ్బందులు ఉన్నారంటే.. కొంతమంది హీరోలు స్పందిస్తారు. తమ తోచిన విధంగా సహాయం చేస్తారు..

Nandamuri Balarkishna: మరోసారి మంచి మనసు చాటుకున్న బాలకృష్ణ.. చిన్నారి క్యాన్సర్ పేషేంట్‌కు చికిత్స కోసం ఆర్ధిక సాయం
Balakrishna
Follow us
Surya Kala

|

Updated on: Sep 21, 2021 | 10:13 AM

Nandamuri Balarkishna: ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు,  ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడే కాదు..తమ అభిమానులు ఇబ్బందులు ఉన్నారంటే.. కొంతమంది హీరోలు స్పందిస్తారు. తమ తోచిన విధంగా సహాయం చేస్తారు.  చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, లారెన్స్ , విశాల్ , జూ. ఎన్టీఆర్ వంటి అనేక మంది హీరోలు తమ అభిమానులకే కాదు.. ఎవరు కష్టాలు ఉన్నారని తెలిసినా..  తమ వంతు సహాయంగా ఏదోకటి చేస్తూ అండగా నిలబడతారు. తాజా మరోసారి నందమూరి బాలకృష్ణ తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఓ చిన్నారి ప్రాణాలు కాపాడడానికి వేగంగా స్పందించారు.  వివరాల్లోకి వెళ్తే..

ఎన్టీఆర్ స్థాపించిన ” బసవతారకం”  క్యాన్సర్ హాస్పిటల్.. ఎంతోమంది క్యాన్సర్ పేషేంట్స్  ప్రాణాలను కాపాడుతుంది. తండ్రి ఎన్టీఆర్ తర్వాత ఈ క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలను బాలకృష్ణ నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రిద్వారా పేద ధనిక అనేక తేడాలేకుండా అనేకమంది క్యాన్సర్ రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు బాలకృష్ణ. ఈనేపధ్యంలో  కొద్ది రోజుల క్రితం హాస్పిటల్లో చికిత్స నిమిత్తం  మల్కాజ్ గిరికి చెందిన మణిశ్రీ అనే ఒక చిన్న పాప క్యాన్సర్ వ్యాధితో హాస్పిటల్ లోకి చేరింది.  మణిశ్రీ ఆపరేషన్ కోసం 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో ఆ  చిన్నారి తల్లిదండ్రులు దాతల సాయంతో లక్షా 80 వేల వరకూ డబ్బులు సేకరించారు.  అయితే మణిశ్రీ ఆపరేషన్ కోసం ఇంకా  5 లక్షల 20 వేల రూపాయలు తక్కువ అయ్యాయి. దీంతో మణిశ్రీ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో బాలకృష్ణ అభిమాని సంఘం అధ్యక్షుడిని కలిశారు. తమ ఆర్ధిక పరిస్థితిని వివరించారు. తమ కూతురు ఆరోగ్య పరిస్థితిని వివరించి .. ఎలాగైనా తమ పాప ఆపరేషన్ విషయంలో సహాయం చేయమని అర్ధించారు.

దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్   ప్రెసిడెంట్  మణిశ్రీ వ్యాధి గురించి.. ఆపరేషన్ గురించి బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్ళాడు. వెంటనే బాలకృష్ణ స్పందించి పాపా ఆపరేషన్ కు కట్టాల్సిన  5 లక్షల 20 వేల రూపాయలు మాఫీ చేయించారు. అంతేకాదు చిన్నారికి తగిన చికిత్స అందించమని వైద్య సిబ్బందికి చెప్పారు. ఈ విషయం తెలియడంతో నందమూరి ఫ్యాన్స్  సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఓ వైపు ఎమ్మెల్యేగా తన భాద్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు వరస సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా తాజాగా అఖండ మూవీలో నటిస్తున్నారు.   నెక్స్ట్  డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో  ఒక సినిమాలో నటించనున్నారు.

Also Read: Kidnapping the Bride: ఆ దీవిలో జరిగేవన్నీ రాక్షస వివాహాలే.. నచ్చిన యువతిని కిడ్నప్ చేసిమరీ పెళ్లి చేసుకునే యువకులు..

వామ్మో.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు.. ధర ఎంతో తెలిస్తే..
వామ్మో.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు.. ధర ఎంతో తెలిస్తే..
సీరియల్ సాయి పల్లవి అంటారు ఆమెను
సీరియల్ సాయి పల్లవి అంటారు ఆమెను
హైదరాబాద్‌లో వీటిని ఒక్కసారైనా చూడాల్సిందే.. ఒక్క రోజు టూర్‌
హైదరాబాద్‌లో వీటిని ఒక్కసారైనా చూడాల్సిందే.. ఒక్క రోజు టూర్‌
మీ Gmail స్టోరేజీ నిండిపోయిందా? పైసా ఖర్చు లేకుండా ఉచిత స్టోరేజీ!
మీ Gmail స్టోరేజీ నిండిపోయిందా? పైసా ఖర్చు లేకుండా ఉచిత స్టోరేజీ!
ఐపీఎల్ మెగా వేలం.. పంత్‌ కోసం గట్టి పోటీ
ఐపీఎల్ మెగా వేలం.. పంత్‌ కోసం గట్టి పోటీ
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..