Kidnapping the Bride: ఆ దీవిలో జరిగేవన్నీ రాక్షస వివాహాలే.. నచ్చిన యువతిని కిడ్నప్ చేసిమరీ పెళ్లి చేసుకునే యువకులు..

Kidnapping the Bride:ప్రపంచం ఆధునిక విజ్ఞానంతో సరికొత్త అలోచనలతో ముందుకు దూసుకెళ్తుంది. అంతరిక్షంలోని వింతలను కనుగొంటున్నాడు.. రోజుకో సరికొత్త వస్తువులను ఆవిష్కరిస్తున్నారు. అయిన్నప్పటికీ ఇప్పటికీ కొన్ని..

Kidnapping the Bride: ఆ దీవిలో జరిగేవన్నీ రాక్షస వివాహాలే.. నచ్చిన యువతిని కిడ్నప్ చేసిమరీ పెళ్లి చేసుకునే యువకులు..
Indonesia]
Follow us
Surya Kala

|

Updated on: Sep 21, 2021 | 9:44 AM

Kidnapping the Bride:ప్రపంచం ఆధునిక విజ్ఞానంతో సరికొత్త అలోచనలతో ముందుకు దూసుకెళ్తుంది. అంతరిక్షంలోని వింతలను కనుగొంటున్నాడు.. రోజుకో సరికొత్త వస్తువులను ఆవిష్కరిస్తున్నారు. అయిన్నప్పటికీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆచారం పేరుతో చేస్తున్న పనులు ఇప్పటికీ అడ్డుకట్టడపడం లేదు.  టెక్నాలజీ  యుగం.. అంటూ ప్రపంచం ముందుకు పోతున్నప్పటికీ ఇంకా మూడ నమ్మకాలను పట్టుకుని వేలాడుతూ బతికేవారు ఇంకా ఉన్నారు. అయితే ఈ మూఢనమ్మకాలతో అమాయక జీవితాలు నాశనం అవుతున్నాయి. మరికొందరి ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినప్పటికీ తమ ఆచార సంప్రదాయం అంటూ మూఢనమ్మకాలను పాటించే వారు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. అలాంటి మూఢనమ్మకంలో ఒకటి రాక్షస వివాహం.. ఇలాంటి వివాహాలు ‘ఇండోనేషియా’లోని ‘సుంబా దీవి’లో జరుగుతున్నాయి. అయితే ఈ వివాహాలు .. అమ్మాయిల ఇష్టంతో జరుగుతున్నవి కావు. అబ్బాయిలు బలవంతంగా మనువాడుతున్నవి. ఈ దురాచారం అక్కడ ‘కవిన్‌ టాంగాప్‌’ అనే పేరుతో కొనసాగుతున్నది. నచ్చిన అమ్మాయిని కిడ్నాప్‌ చేసి పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి.

‘సుంబా’ ప్రజల ఇతర ఆచారాలూ, నమ్మకాలూ చాలా విచిత్రంగా ఉంటాయి. వీరు ‘మరపు’ అనే ప్రాచీనమతాన్ని కూడా ఆచరిస్తారు. వస్తువులకు ప్రాణం ఉందని నమ్ముతారు. నీళ్లు నుదుటిని తాకితే ఇంట్లోంచి బయటికి వెళ్లకూడదనేది వీరి విశ్వాసం. అందుకే కిడ్నాప్‌ అయిన అమ్మాయిని ఇంట్లోకి లాక్కెళ్లి తలకు నీళ్లు తాకిస్తారు. ఇక తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి యువకుడు అవసరమైతే తన బంధుగణంతో అమ్మాయి ఇంటి మీదకు దండయాత్రకూ వెళ్తాడు. అప్పుడు అమ్మాయిని కిడ్నప్ చేసి..  అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళాడు అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అయితే కిడ్నాప్ అనంతరం అదే వ్యక్తికి ఆ మహిళ ను ఇచ్చి వివాహం చేస్తారు. అయితే ఒకవేళ ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చకపోయినా కాపురం చేయాల్సిందే.

కిడ్నాప్‌ తర్వాత పెళ్లి నుంచి తప్పించుకున్న అమ్మాయిలు చాలా అరుదు. ఒకవేళ తప్పించుకున్నా ఆ అమ్మాయికి సమాజంలో గౌరవం ఉండదు. పెళ్లి చేసుకోవడానికి, పిల్లలు కనడానికి వారు తగరని వెలివేస్తారు. అవమానకరంగా చూస్తారు. ఆ భయంతో అక్కడి ఆడపిల్లలు కిడ్నాప్‌ చేసినవారినే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. ఈ ఆచారం నుంచి ఓ యువతి తప్పించుకుని తనకు నచ్చినవాడిని పెళ్లి చేసుకుంది.  సుంబాలో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న 28 ఏళ్ల యువతి  కిడ్నాప్ అయ్యింది. ఒకరోజు ఆమెను తన తండ్రి తరపు దూరపు బంధువులే కిడ్నాప్‌ చేశారు. ఏదో సమావేశం ఉంది హాజరు కావాలని నమ్మించి, బలవంతంగా కారు ఎక్కించారు. కారు వరుడు ఇంటి ముందు ఆగగానే పెద్దగా గంటలు మోగించి, మంత్రాలు చదువుతూ  ఆ యువతిని ఇంట్లోకి లాక్కెళ్లారు. ఈ విషయాన్ని అతి కష్టం మీద తన తల్లిదండ్రులకు, సన్నిహితులకు మెసేజ్‌ చేసింది యువతి. ప్రేమతోనే కిడ్నాప్‌ చేశామని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా ఆ యువతి లొంగలేదు.. ఆరు రోజులపాటు తనని తాను రక్షించుకుంది. అనంతరం మహిళా సంఘాలు రంగంలోకి దిగాయి. అనేక చర్చల తర్వాత ఆ యువతిని విడిపించారు.  తర్వాత తను ఇష్టపడిన అబ్బాయినే పెళ్లి చేసుకుంది ఆ యువతి. ఇలా ఇప్పటి వరకూ ఆ యువతి సహా ముగ్గురు మాత్రమే తప్పించుకోగలిగారు.  గత జూన్‌లో కూడా ఇలాంటి కిడ్నాప్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. కఠిన చర్యలు లేకపోవడమే ఈ దురాచారానికి కారణమని.. మహిళా సంఘాలు దుమ్మెత్తిపోశాయి.  అందుకే ఇటువంటి వింత ఆచారాల విషయంలో ఇండోనేషియా ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా చర్యలు తీసుకునే ఆలోచనలో ఇండోనేషియా ప్రభుత్వం వుంది.

Also Read: Cauliflower Pickle: ఆంధ్రా స్టైల్ లో ఈజీగా రుచికరమైన కాలిప్లవర్ నిల్వ పచ్చడి తయారీ ఎలా అంటే..