Tollywood : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు.. ఆ స్టార్ డైరెక్టర్, హీరోకు బిగ్ రిలీఫ్
సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కేసును కొట్టి వేసినట్లు తెలిపింది. ఇక.. 2018 నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్‌గా ఎక్సైజ్ శాఖ దూకుడు ప్రదర్శించింది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తరుణ్‌తోపాటు పలువురిపై డ్రగ్స్ కేసు నమోదు చేసింది.

గత ప్రభుత్వ హయాంలో ప్రకంపనలు సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. 2018లో పలువురు తారలపై నమోదు చేసిన ఆరు కేసులను నాంపల్లి కోర్టు కొట్టిపారేసింది. సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కేసును కొట్టి వేసినట్లు తెలిపింది. ఇక.. 2018 నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్‌గా ఎక్సైజ్ శాఖ దూకుడు ప్రదర్శించింది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తరుణ్‌తోపాటు పలువురిపై డ్రగ్స్ కేసు నమోదు చేసింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి.. నెలల తరబడి విచారించినా ఫలితం లేకపోయింది.
ఈ క్రమంలోనే.. అనుమానితుల నుంచి వెంట్రుకలు, గోళ్ల శాంపిల్స్ తీసుకున్నారు. కేవలం పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా.. ఇద్దరి శరీరంలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ తేల్చింది. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ ప్రకారం ఆరు కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లభించలేదని న్యాయస్థానం గుర్తించింది. పూరీ జగన్నాథ్, తరుణ్ శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లభ్యం కాలేదంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించిన రిపోర్టులను పరిశీలించి ఎనిమిది కేసుల్లో ఆరింటిని కొట్టివేసింది.
ఫలితంగా.. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన విధివిధానాలు అధికారులు సరిగా ఫాలో కాకపోవడంతో కోర్టులో ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. మరోవైపు.. డ్రగ్స్ కేసులో జాంబియా యువతికి ఎల్బీనగర్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయలు జరిమానా విధించింది. 2021లో జాంబియా నుంచి హెరాయిన్ డ్రగ్స్ తీసుకొచ్చి.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడింది. సుమారు 50 కోట్ల విలువ చేసే 8 కిలోల హెరాయిన్ దొరకడంతో నిందితురాలని అరెస్టు చేసి జైలుకు తరలించారు అధికారులు. ఇక.. తాజాగా.. ఈ కేసులో జాంబియా యువతిని ఎల్బీనగర్ కోర్టు దోషిగా తేల్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
