AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: శివపార్వతుల చేతిలో సిగరెట్’ | ‘షట్‌ డౌన్ చేస్తున్నాం’ ఐబొమ్మ అనౌన్స్మెంట్

రామ్ హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్ మూవీ చెన్నై ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ఇక జూన్ 7న జరిగిన ఈవెంట్‌లో తమిళ సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

TOP 9 ET News: శివపార్వతుల చేతిలో సిగరెట్' | 'షట్‌ డౌన్ చేస్తున్నాం' ఐబొమ్మ అనౌన్స్మెంట్
Top 9 Et News
Phani CH
|

Updated on: Jul 07, 2022 | 8:30 PM

Share

1. The Warrior రామ్ హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్ మూవీ చెన్నై ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ఇక జూన్ 7న జరిగిన ఈవెంట్‌లో తమిళ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. కృతి శెట్టి హీరోయిన్‌.

2. Khushi విజయ్ దేవరకొండ, సమంత జంటగా తెరకెక్కుతున్న ఖుషీ మూవీ టీమ్‌ నెక్ట్స్ షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసిన యూనిట్‌… వైజాగ్‌లో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

3. Ladki రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లడ్కీ డ్రాగన్ గర్ల్’ మూవీ భారీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 40 వేల థియేటర్లలో రిలీజ్ అవుతుందని ప్రకటించారు ఆర్జీవీ. 5 భారతీయ భాషలతో పాటు చైనీస్‌లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది.

4. Driver Jamuna ఐశ్వర్య రాజేష్‌ లీడ్‌ రోల్‌ తెరకెక్కిన ట్రావెల్‌ డ్రామా డ్రైవర్‌ జమున. ఇంకా రిలీజ్ డేట్‌ ఎనౌన్స్‌ కాకపోయినా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో మాత్రం స్పీడు పెంచింది మూవీ టీమ్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. జమున టాక్సీ ఎక్కిన వారికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో థ్రిల్లింగ్‌గా తెరకెక్కింది డ్రైవర్ జమున.

5. Aha కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ సమ్మతమే. థియేట్రికల్ రిలీజ్‌లో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాను జూలై 15 నుంచి డిజిటల్ ఆడియన్స్‌కు అందుబాటులోకి తీసుకురానుంది ఆహా.

6. Legend ప్రముఖ బిజినెస్‌మేన్‌ లెజెండ్ శరవణన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న మూవీ లెజెండ్‌. జేడీ – జెర్రీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఊర్వశీ రౌతెలా, గీతికా తివారీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

7. Karan Johar కాఫీ విత్ కరణ్ కొత్త సీజన్‌ నేపథ్యంలో వస్తున్న విమర్శలపై స్పందించారు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌. వర్చువల్‌ వరల్డ్‌లో చేసే కామెంట్స్‌ను తాను పట్టించుకోనని… అదంతా నిజం కాదంటూ కొట్టి పారేశారు కరణ్. కాఫీ విత్ కరణ్ సీజన్‌ సెవెన్‌ ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతోంది.

8.Leena మరో సారి హిందూ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. కాంట్రవెర్సీ లేడీ డైరెక్టర్ లీనా మణిమేకల. తాజాగా తన ట్విట్టర్ హ్యాండిలింగ్‌లో మరో వివాదాస్పద పిక్ ను షేర్ చేశారు. శివ పార్వతుల వేషధారణలో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. సిగరెట్ తాగుతున్నట్టుగా ఉన్న ఫోటోను ట్రోలర్స్ అండ్ హిందుత్వ సంఘాలమీదికి విసిరారు. అంతేకాదు ఇది ఎక్కడో.. అని ఆ ఫోటోకు కోట్ చేసి.. తన డాక్యుమెంటరీలోంది కాదన్నట్టు హింట్ ఇచ్చారు. నెట్టింట మరో సారి వైరల్‌ అవుతున్నారు.

9. Ibomma అవును ! ఐబొమ్మ యాజమాన్యానికి తాజాగా కోపం వచ్చింది. వారి మీద వస్తున్న ట్రోల్స్ చూసి.. చాలా సీరియస్ గా రియాక్టయ్యారు ఐబొమ్మ సైట్ యాజమాన్యం. రియాక్టవడమే కాదు.. తన వెబ్‌సైట్ పేజీలో ఓ పెద్ద నోట్‌ నే పోస్ట్ చేశారు. మా వెబ్‌ సర్వర్ ను షెట్‌డౌన్ చేస్తున్నాం అంటూ.. రెడ్‌ కలర్‌లో బిగ్‌ ఫాంట్‌తో పబ్లిష్ చేశారు. దానికి రీజన్ ఏంటో… ఆ లైన్ కిందే రాసుకొచ్చారు ఐ బొమ్మ వారు. 99.999% అప్‌ టైంతో క్లౌడ్‌ సర్వర్‌ ను మెయిన్ టెయిన్ చేయడం అంత ఈజీ కాదంటూ.. ఫ్రాంక్‌గా చెప్పిన ఐబొమ్మ టీంమెంబర్స్ .. తమ కష్టాన్ని మాత్రం ఎవరూ గుర్తించడం లేదంటూ.. ఫీలయ్యారు.