Renu Desai: చీపురు పట్టి.. చెత్తను తీసేసి.. ఆలయాన్ని శుభ్రం చేసిన నటి రేణూ దేశాయ్.. వీడియో ఇదిగో
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ చేయడం లేదు. అయితే సామాజిక సేవా కార్యక్రమాలతో నిత్యం బిజీ బిజీగా ఉంటోంది. తాజాగా ఆమె ఓ ప్రముఖ ఆలయానికి వెళ్లిన ఆమె అక్కడి పరిసరాలను నీటితో కడిగి శుభ్రం చేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ప్రముఖ నటి రేణూ దేశాయ్ ఇటీవల ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రేణూ దేశాయ్ పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. అయితే 2023 లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె పోషించిన హేమలతా లవణం పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అయితే దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రేణూ ఇటీవలే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాలతో నూ బిజీ బిజీగా ఉంటుందీ అందాల తార. మహిళలు, చిన్నారులు, మూగజీవాల సమస్యల పట్ల తన సేవా దృక్పథాన్ని చాటుకుంటోంది. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు, క్యాంపెయిన్లు కూడా నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ (NGO)ను కూడా ప్రారంభించింది రేణూ. ఇదిలా ఉంటే గురువారం (డిసెంబర్ 04) ఈ అందాల తార పుట్టిన రోజు. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు ముందస్తు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కాగా ప్రస్తుతం రేణూ దేశాయ్ ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నట్లుంది.
తాజాగా దండపాణి బాబా ఆలయాన్ని దర్శించుకుంది రేణూ దేశాయ్. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేసింది. అయితే ఇదే సందర్భంగా తన సేవా దృక్పథాన్ని చాటుకుంటూ ఆలయ పరిసరాలను నీటితో కడిగి శుభ్రం చేసింది. గుడిలో పడి ఉన్న చెత్తనంతా పోగు చేసి బయట పడేసింది. ఇందుక సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె ‘నాకు కాలభైరవుడి ఆలయం తర్వాత బాగా ఇష్టమైనది ఈ దండపాణి బాబా గుడి. నేను తరచూ ఇక్కడకు వస్తుంటాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. అయితే ఎప్పుడూ ఇలా ఫొటోలు, వీడియోలు తీసుకోలేదు. అయితే ఈ వీడియో మీకు స్ఫూర్తినిస్తుందని షేర్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంటి చుట్టూ ఉన్న దేవాలయాలను శుభ్రంగా ఉంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. నేను హైదరాబాద్‌లో కూడా ఇలాంటి సేవలు చేయాలనుకుంటున్నాను. హర్ హర్ మహాదేవ్’ అని రాసుకొచ్చింది.
ఆలయ ప్రాంగణాన్ని కడుగుతోన్న రేణూ దేశాయ్..
View this post on Instagram
ప్రస్తుతం రేణూ దేశాయ్ షేర్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ఈ అందాల తారపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








