AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: పెళ్లి చేసుకోవడం కంటే ఆ పని చేయడం వంద రెట్లు బెటర్.. ఈ టాలీవుడ్ హీరోయిన్ లైఫ్‌లో ఏం జరుగుతోంది?

ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయని ఈ టాలీవుడ్ హీరోయిన్ తన వ్యక్తిగత జీవితంతో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన భర్తతో విడాకులు తీసుకుందని సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ మాత్రం స్పందించడం లేదు. అలాగనీ డైవోర్స్ రూమర్లను కూడా ఖండించడం లేదు.

Actress: పెళ్లి చేసుకోవడం కంటే ఆ పని చేయడం వంద రెట్లు బెటర్.. ఈ టాలీవుడ్ హీరోయిన్ లైఫ్‌లో ఏం జరుగుతోంది?
Tollywood Actress
Basha Shek
|

Updated on: May 25, 2026 | 6:10 PM

Share

స్వాతి అలియాస్ కలర్స్ స్వాతి గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొదట్లో టీవీ షోలతో బాగా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మడేంజర్‌ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక అష్టా చెమ్మా సినిమాలో స్వాతి నటన నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. స్వామి రారా, కార్తికేయ, గోల్కొండ హైస్కూల్ , త్రిపుర, లండన్ బాబులు వంటి సూపర్ హిట్ సినిమాల్లోనూ కథానాయికగా అలరించిందీ అందాల తార. అలాగే మిరపకాయ్, కందిరీగ, బంగారు కోడిపెట్ట తదితర సినిమాల్లో క్యామియో రోల్స్ పోషించింది. ఇక చివరిగా 2023లో మంత్ ఆఫ్ మధు సినిమాలో కనిపించింది స్వాతి. అయితే సినిమా కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ. 2018లో కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసును స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన కొన్నేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి నట్లు ప్రచారం జరుగుతోంది. విడాకులు కూడా తీసుకున్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఇలా పుకార్లు రావడానికి కారణమూ లేకపోలేదు. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లలో పెళ్లి ఫొటోలతో పాటు భర్తకు సంబంధించిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసింది. అయితే విడాకుల రూమర్లపై అటు స్వాతి కానీ, ఆమె భర్త కానీ ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా బయట దీని గురించి అడిగినా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోంది స్వాతి.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అదే సమయంలో పెళ్లి గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లి చేసుకోవడం కన్నా ఓ కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని తన మనసులోని మాటను బయట పెట్టేసింది స్వాతి. ‘ఈ రోజుల్లో ఒక మనిషిని నమ్మి, వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఉండటం చాలా కష్టంగా మారిపోయింది. ప్రస్తుతం ఎవరికీ కూడా కొంచే కూడా ఓపిక ఉండడం లేదు. అందుకే ముక్కు, మొహం తెలియని వ్యక్తిని పెళ్లాడి ప్రతిరోజూ మానసిక ప్రశాంతతను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే పెళ్లి కంటే ఎలా చింతా లేకుండా హాయిగా ఒక కుక్కను పెంచుకోవడం చాలా బెటర్. ఎందుకంటే అది మనకు ఎప్పుడూ నమ్మకంగా ఉంటుంది. ఎలాంటి కండిషన్స్ లేకుండా మనల్ని ప్రేమిస్తోంది’ అని చెప్పుకొచ్చింది స్వాతి. ప్రస్తుతం ఆమె మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

స్వాతి లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Poulami 𓆉︎ (@pouume.e)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us