Tollywood: కాలినడకన తిరుమల శ్రీవారి చెంతకు టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు.. వీడియో వైరల్.. గుర్తు పట్టారా?

సినిమా సక్సెస్ అవ్వాలని రిలీజ్ కు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు చాలా మంది. అలా తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు ఏడు కొండవాడిని దర్శించుకున్నారు. సామాన్య భక్తుల్లాగా కాలినడకన తిరుమలకు వెళ్లి అక్కడ స్వామి వారికి మొక్కులు చెల్లించారు.

Tollywood: కాలినడకన తిరుమల శ్రీవారి చెంతకు టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు.. వీడియో వైరల్.. గుర్తు పట్టారా?
Tollywood Celebrities

Updated on: Apr 27, 2025 | 10:51 AM

వేసవి సెలవులు కావడంతో చాలా మంది విహార యాత్రలకు, అలాగే పుణ్య క్షేత్రాల దర్శనానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక సినీ ప్రముఖులు కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు. ఈ క్రమంలో త్వరలో రిలీజ్ కానున్న తమ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తుల్లో కలిసిపోయి కాలినడకన మెట్లు ఎక్కుతూ తిరుమలకు చేరుకున్న ఈ స్టార్స్ ఆదివారం (ఏప్రిల్ 27) ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. . అయితే తిరుమలకు వెళ్లేటప్పుడు తమను ఎవరూ గుర్తు పట్టకుండా ముఖాలకు మాస్కులు, కర్చీఫ్ లు ధరించారీ స్టార్ హీరోయిన్లు. దీంతో చాలా మంది భక్తులు వీరిని గుర్తు పట్టలేకపోయారు. అయితే కొంత మంది టాలీవుడ్ సెలబ్రిటీలను గుర్తు పట్టి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి . పై ఫొటో అదే.

మరి అందులోఉన్న టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లను గుర్తు పట్టారా? వారు మరెవరో న్యాచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి. వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం హిట్ -3. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మేడే కానుకగా మే 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సుప్రభాత సేవ సమయంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు హీరో, హీరోయిన్లకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇవి కూడా చదవండి

తిరుమల మెట్ల దారిలో నాని, శ్రీనిధి శెట్టి..

 

అంతకుముందు కాలి నడకన శ్రీవారి మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు నాని, శ్రీనిధి శెట్టి. ఇక హిట్ -3 సినిమా విషయానికి వస్తే.. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాని అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్, అదిల్ పాలా, సూర్య శ్రీనివాస్ తదితరలు నటించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన టీజర్స్, ట్రైలర్ చూస్తే సినిమాలో ఫుల్ వయోలెన్స్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.

శ్రీవారి ఆలయంలో హిట్-3. టీమ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.