Tollywood: సిక్స్‌ప్యాక్‌తో సర్ ప్రైజ్ ఇచ్చిన టాలీవుడ్ క్రేజీ హీరో.. సినిమా కోసం నీ హార్డ్ వర్క్‌కు హ్యాట్సాఫ్ భయ్యో!

|

Dec 29, 2024 | 7:09 AM

సినిమాల కోసం తనను తాను మార్చుకునే నటీనటులు చాలా కొద్ది మందే ఉంటారు. భారీగా బరువు పెరగడం, తగ్గడం, సిక్స్ ప్యాక్, గడ్డం పెంచడం.. ఇలా చాలా రకాలుగా కష్టపడుతుంటారు హీరోలు. ఈ టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతాడు.

Tollywood: సిక్స్‌ప్యాక్‌తో సర్ ప్రైజ్ ఇచ్చిన టాలీవుడ్ క్రేజీ హీరో.. సినిమా కోసం నీ హార్డ్ వర్క్‌కు హ్యాట్సాఫ్ భయ్యో!
Tollywood Actor
Follow us on

ట్యాలెంట్ ఉన్నా లక్ కలిసిరాని టాలీవుడ్ నటుల్లో ఈ క్రేజీ హీరో కూడా ఒకడు. సినిమా కోసం ఎంతో కష్టపడతాడు. ప్రాణం పెట్టి నటిస్తాడు. కేవలం హీరోగానే కాదు విలన గానూ అదరగొడతాడు. ఈగోను పక్కన పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో సహాయక నటుడి పాత్రలతోనూ మెప్పిస్తాడు. అయితే ఎంత కష్టపడినా స్టార్ స్టేటస్ అందుకోలేకపోతున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. అలాగనీ తన ప్రయత్నాలు ఆపడం లేదు. తాజాగా తన లేటెస్ట్ సినిమా కోసం ఏకంగా సిక్స్ ప్యాక్ ట్రై చేశాడీ క్రేజీ హీరో. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇందులో షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ బాడీతో సాలీడ్‌గా కనిపిస్తున్నది మరెవరో కాదు టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్. తన లేటెస్ట్ సినిమా ‘మజాకా’ కోసమే సందీప్ ఇంతగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలను చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు సందీప్ కిషన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘సినిమా పట్ల మీ డెడికేషన్, హార్డ్ వర్క్ కు హ్యాట్సాఫ్’ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

కాగా ఈ ఏడాదిలో ఇప్పటికే సందీప్ కిషన్ నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఊరిపేరు భైరవకోన తో సోలో గా హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్, రాయన్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఇవి కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. సందీప్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.  ఇప్పుడు మజాకాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడీ క్రేజీ హీరో.

సిక్స్ ప్యాక్ లుక్ లో సాలిడ్ గా సందీప్ కిషన్..

ధమాకా ఫేమ్ త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తోన్న మజాకా సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

మజాకా సినిమా సెట్స్ లో రీతూ వర్మతో సందీప్ కిషన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.